టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ యాక్టర్స్ లో శ్రీవిష్ణు ఒకరు. ఎటువంటి సినీ నేపథ్యం లేనటువంటి కుటుంబం నుంచి వచ్చిన శ్రీవిష్ణు.. 2009లో బాణంతో మూవీతో వెండితెరపై అడుగుపెట్టాడు. చిన్న చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. మెంటల్ మదిలో, బ్రోచేవారెవరురా, గాలి సంపత్ వంటి చిత్రాలు శ్రీవిష్ణుకు మంచి క్రేజ్ తెచ్చిపెట్టాయి.
గత ఏడాది సామజవరగమన, ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్న శ్రీవిష్ణు.. ప్రస్తుతం హసిత్గోలి దర్శకత్వంలో `స్వాగ్` అనే డిఫరెంట్ మూవీ చేస్తున్నాడు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక శ్రీవిష్ణు పర్సనల్ లైఫ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. సినిమాల్లోకి వచ్చాక శ్రీవిష్ణు వివాహం చేసుకున్నాడు. ఆయన భార్య పేరు ప్రశాంతి. ఆమె కూడా ఇండస్ట్రీకి చెందిన వారే.
శ్రీవిష్ణు యాక్ట్ చేసిన అప్పట్లో ఒకడుండేవాడు, నీదీ నాదీ ఒకే కథ వంటి సినిమాలకు ప్రశాంతి ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు. అప్పట్లో ఒకడుండేవాడు సినిమా సమయంలో శ్రీవిష్ణు, ప్రశాంతి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆ తర్వాత పెద్దలను ఒప్పించి ఇద్దరూ వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు మృదా అనే అందమైన కూతురు కూడా ఉంది. ఇప్పటి వరకు మీరు శ్రీవిష్ణు వైఫ్ అండ్ డాటర్ ను చూసుండకపోతే పైన పిక్స్ ఉన్నాయ్.. ఓ లుక్కేసేయండి మరి!