తెలంగాణ రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. అధికార పార్టీ దూకుడు కళ్లెం వేయాల్సిన అవస రం ఉందనే వాదన బలంగా వినిపిస్తోంది. ముఖ్యంగా టీఆర్ ఎస్ నాయకుడు, ఇటీవల మంత్రి వర్గం నుం చి బర్తరఫ్కు గురైన.. ఈటల రాజేందర్‌కు ఇప్పుడు కొన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలో నే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి.. సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అవసరం ఉందని కొండా వ్యాఖ్యానించారు. అలాంటి ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక కోసం తాను, ఈటల రాజేందర్ మరికొంత మంది ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
కేసీఆర్‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో చాలా వ్యతిరేకత ఉందన్న విశ్వేశ్వరరెడ్డి.. కేసీఆర్ కేబినెట్లోని మరో ఇద్దరు మంత్రులు తమతో టచ్‌లో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. టీఆర్ఎస్పై పోరాటం చేసే పరిస్థితిలో కాంగ్రెస్, బీజేపీలు లేవని, తమ ఆలోచనలకు రేవంత్‌రెడ్డి మద్దతు కూడా ఉందని చెప్పారు. మరో రెండు నెలల్లో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటాయ ని వ్యాఖ్యానించారు.
వైఎస్ తనయ, త్వరలోనే పార్టీ ప్రకటిస్తానని చెప్పిన షర్మిలకు తెలంగాణలో రాజకీయ భవిష్యత్ ఉంటుందని అనుకోవడంలేదన్న కొండా.. కొత్త శక్తుల ఏకీకరణకు పునాదులు పడుతున్నాయని చెప్పారు. ఇక, కేసీఆర్ ప్రభుత్వం ఈటల విషయంలో దారుణంగా ప్రవర్తించిందనే అభిప్రాయం సర్వత్రా వినిపిస్తోందని చెప్పారు. దేవరయాంజల్ భూముల వ్యవహారంలో టీఆర్ఎస్ హై కమాండ్ ఈటల రాజేందర్‌ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేసిన విషయం తెలిసిందే.
ఈటలపై అధికారపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. ఈటల ఒక్కరిపైనే కాదు.. టీఆర్ఎస్లో భూకబ్జాలకు పాల్పడిన ప్రతిఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈటల రాజేందర్ పార్టీ మారితే తమ తమ పార్టీల్లోకి తీసుకోవాలని యోచిస్తున్నాయి. కానీ ఆయన మాత్రం సొంతంగా పార్టీ పెట్టాలని అనుకుంటున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలో ఇప్పటికే కొండా విశ్వేశ్వరరెడ్డితో ఆయన భేటీ కావడం.. తర్వాత మారుతున్న పరిణామాలు ఆసక్తిగా మారాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.