తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన మాజీ ఐఏఎస్ అధికారి, కర్ణాటక ప్రభు త్వ మాజీ ప్రధాన కార్యదర్శి కె. రత్నప్రభకు ఆదిలోనే పెద్ద అడ్డంకి ఎదురైంది. ఎస్సీ సామాజిక వర్గానికి చెం దిన రత్న ప్రభకు ఇక్కడ టికెట్ ఇచ్చిన బీజేపీ గెలుపు గుర్రం ఎక్కడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న విషయం తెలిసిందే. అయితే.. రత్న ప్రభపై ఇప్పుడు కేసునమోదు చేసేందుకు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్న జనతాదళ్ (యు) నేత ఏవీ రమణ రెడీ అయ్యారు. ప్రస్తుతం ఇది సంచలనంగా మారింది.
రత్నప్రభ రెండు రోజుల కిందట.. తన అభ్యర్థిత్వానికి సంబంధించి నామినేషన్ పత్రాలను దాఖలు చేశా రు. ఈ క్రమంలో ఆమె తన ఆస్తులు, అప్పులతో కూడిన వివరాలను అఫిడవిట్లో పొందుపరిచారు. అదేస మయంలో తనపై ఎలాంటి కేసులు లేవని పేర్కొన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు.. తమపై ఉన్న కేసులను వెల్లడించారు. ఇక, మూడు నుంచి ఐదేళ్లు జైలు శిక్ష పడే కేసులు ఉంటే.. ఖచ్చితంగా స్థానిక మీడియాలో ప్రకటించాలి కూడా. తద్వారా ఓటర్లు తమకు నచ్చిన అభ్యర్థిని ఎంచుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ఎన్నికల సంఘం నియమావళి పేర్కొంటోంది.
కానీ, రత్న ప్రభ.. తన ఆస్తులు, అప్పుల వివరాలను వెల్లడించినా.. తనపై కేసుల వివరాలను అఫిడవి ట్లో పేర్కొన్నలేదు. తనపై ఎలాంటి కేసులు లేవని ఆమె పేర్కొనడంతోపాటు.. మీడియా సమావే శంలోనూ తనపై ఇప్పటి వరకు ఒక్క పోలీసు కేసు కూడా నమోదు కాలేదని చెప్పారు. అయితే.. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికలో పోటీ చేస్తున్న జనతాదళ్(యు) అభ్యర్థిఏవీ రమణ మాత్రం.. రత్నప్రభపై గతంలోనమోదైన కేసుల వివరాలను వెలికి తీశారు. దీని ప్రకారం.. హనుమంతుపాడు, సైఫాబాద్, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లలో రత్నప్రభపై 5 కేసులు నమోదయ్యాయని తెలిపారు..
వాటిని ఆమె దాచి పెట్టి.. అఫిడవిట్ సమర్పించారని ఏవీ రమణ పేర్కొన్నారు. ఈ క్రమంలో రత్నప్రభను డిస్ క్వాలిఫై చేయాలంటూ.. ఏవీ రమణ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీనిపై చర్యలు తీసుకోకపోతే.. మరో రూపంలో చర్యలు తీసుకుంటామని హెచ్చరించడం గమనార్హం. మొత్తానికి ఈ పరిణామం.. ఎటు దారితీస్తుందో.. బీజేపీ ఎలా సమర్ధించుకుంటుందో చూడాలి.