బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నం ఫలించింది. చేతికి మట్టి అంటకుండా.. ఆయన మీడియా ముం దుకు రాకుండా.. ఎలాంటి బహిరంగ ప్రకటనలు చేయకుండానే భారీ సంక్షోభం దిశగా పయనిస్తోందన్న కవిత వ్యవహారానికి చెక్ పెట్టారని తెలుస్తోంది. తన తండ్రి, బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి కవిత రాసిన లేఖ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. సూచనల పేరుతో ఆమె చేసిన వ్యాఖ్యలు .. దేవుడు-దయ్యాలంటూ.. చేసిన కామెంట్లు.. సెగ పుట్టించాయి.
మరోవైపు ఓ వర్గం మీడియాలో కవిత పార్టీ పెడుతున్నట్టు తెగ వార్తలు వచ్చాయి. ఈ పరిణామాల క్రమంలో కేసీఆర్ స్పందించకపోవడం.. పైగా లేఖ సంధించిన కుమార్తె వైపు ఆయన తొంగి చూడకుండా… వివాదాని కి కేంద్రమని ప్రచారంలోకి వచ్చిన కేటీఆర్‌ను ఆయన పిలిచి.. మాట్లాడడం వంటివి, దీనిని మరింత పెంచుతున్నాయన్న చర్చ ప్రారంభమయ్యేలా చేశాయి. ఇలా మూడు రోజుల పాటు అనేక చర్చలు.. అంచనాలు.. కథనాలు.. పుకార్లు హల్చల్ చేశాయి.
చివరకు ఏమీ లేదని తేలిపోయింది. కవిత దగ్గరకు.. కేసీఆర్ తన అత్యంత సన్నిహితుడు.. రాజ్యసభ ఎం పీ దామోదర్‌రావును, బీఆర్ ఎస్ లీగల్ సెల్ నాయకుడు ఓ న్యాయవాదిని పంపించారు. ఏం చర్చించా రన్నది మాత్రం బహిర్గతం కాకపోయినా ప్రస్తుతం రాజుకున్న వివాదంమాత్రం దాదాపు సమసిపోయింద నే అంటున్నారు ఆ పార్టీ నాయకులు. కవిత కూడా సైలెంట్ అయ్యారు. పైగా తెలంగాణ ఏసీబీ అధికారు లు కేటీఆర్‌కు నోటీసులు ఇవ్వడాన్ని ఆమె తప్పుబట్టడం మరో విశేషం.
రాష్ట్రంలో దుర్మార్గపు పాలన సాగుతోందని.. ప్రజల సమస్యలను ప్రస్తావించిన వారిపై కేసులు పెడుతు న్నారని కవిత విమర్శలు గుప్పించారు. సో.. ఆమె వ్యాఖ్యల తర్వాత.. ఈ వివాదానికి చెక్ పెట్టారన్న వాదనకు మరింత బలం చేకూరినట్టు అయింది. దీంతో ఇప్పుడు బీఆర్ ఎస్‌లో ఎలాంటి వివాదాలు లేవని.. కేసీఆర్ బహిరంగంగా వచ్చి ఎలాంటి కామెంట్లు చేయకుండానే .. టీ కప్పులో తుఫాను మాదిరిగా కవిత లేఖ, తదనంతర పరిణామాలు సమసి పోయాయని అంటున్నారు పరిశీలకులు.