వైసీపీ లో తీవ్ర కలకలం రేగుతోంది. చాలా మంది నాయకులు జిల్లాలు వదిలేసి వెళ్లిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో నాయకులు వైసిపి అధినేతకు అందుబాటులో లేకుండా పోయారని చర్చ సాగుతోంది. వీరంతా త్వరలో పార్టీ మారిపోవడం ఖాయమని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఏలూరు జిల్లా అధ్యక్షుడుగా ఉన్న ఆళ్ళ నాని పార్టీకి దూరమయ్యారు. రాజకీయంగా కూడా ఆయన దూరమైనట్టు ప్రకటించారు.
మిగిలిన నాయకులు కొట్టు సత్యనారాయణ, కారుమూరు నాగేశ్వరరావు వంటి కీలక నాయకులు కూడా ఇప్పుడు పార్టీ మారేందుకు సిద్ధమవుతున్నారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. గత రెండు రోజు లుగా కీలక నాయకులు పార్టీ మారిపోతున్నారని ప్రచారం జరుగుతున్నా ఎవరూ దీన్ని ఖండించకపోవ డం, తాము వైసీపీలో ఉంటామని చెప్పకపోవడం వంటివి ఆశ్చర్యంగా మారాయి. మరోవైపు పార్టీ అధిష్టా నం కూడా పోయే వారిని పోనీ అన్నట్టుగా వదిలేసినట్టు తెలుస్తుంది.
ఇప్పటివరకు రాజీనామా చేసిన వాళ్లతో కనీసం స్పందించకపోవడం, పార్టీ అధినేత జగన్ పట్టించుకోకపో వడాన్ని బట్టి ఇక తన దారి తాను చూసుకునేందుకు ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల నాయకులు కూడా సిద్ధమయ్యారని అంటున్నారు. పార్టీలో ఉండి ప్రయోజనం లేదని, పార్టీ పుంజుకునే పరిస్థితి లేదని వారు బలంగా నమ్ముతున్నట్టు తెలుస్తుంది. ఈ పరిణామాలకు తోడు నాయకులు జిల్లాలకు దూరంగా ఉండటం ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవటం వంటివి బలాన్ని ఇస్తున్నాయి.
ఎలా చూసుకున్నా వచ్చే పది పదిహేను రోజుల్లో ఖచ్చితంగా మార్పులు అయితే ఖాయమని తెలుస్తుంది. మరి జగన్ ఇలాంటి వారిని ఆపుతారా లేక చూస్తూ కూర్చుంటారా అనేది చర్చనీయాంశంగా మారింది. కీలక నేతలు పార్టీ మారితే.. ఇక ఆయా జిల్లాల్లో పార్టీ మనుగడ కూడా ప్రశ్నగా మారుతుందని అంటున్నా రు పరిశీలకులు. ఇప్పటికే ఏలూరులో ఆళ్ల వెళ్లిపోయిన తర్వాత.. పార్టీ బలహీన పడింది. ఏలూరు మునిసిపాలిటీ దాదాపు కూటమి పరమైంది. ఇలా.. మిగిలిన చోట్ల కూడా మారే పరిస్థితి ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.