వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. ప్రజల్లోకి వచ్చేందుకు సిగ్గు పడుతున్నారా? ఉద్యమాలు చేసేందుకు .. నిరసనలు వ్యక్తం చేసేందుకు ఆయన భిడియపడుతున్నారా? అంటే.. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి చర్చే జరుగుతోంది. జగన్ వెనుకంజ వేస్తున్నారని పెద్ద ఎత్తున ట్రోల్స్ వస్తున్నాయి. దీనికి కారణం.. పలు ఉద్యమాలను చేపట్టాలని జగన్ పిలుపునివ్వడం.. నాయకులు, కార్యకర్తలు ఆయా కార్యక్రమాల్లో పాల్గొనా లని ముక్తాయించడం కొన్నాళ్లుగా సాగుతోంది.
అయితే.. అధినేత లేని ఉద్యమం అంటే.. పసుపు లేని గడపతో సమానం అన్నట్టుగా నాయకులు వ్యాఖ్యా నిస్తున్నారు. ఏదో మొక్కుబడిగా ఆయా కార్యక్రమాలు నిర్వహించి చేతులు దులుపుకొంటున్నారు. గత నెల రోజుల్లో రెండు ఉద్యమాలు చేపట్టినా.. ఆశించిన మేరకు అవి ప్రజల్లోకి వెళ్లలేదు. దీనికి కారణం.. అధినేత లేకపోవడమే.. క్షేత్రస్థాయిలో కాలు మోపకపోవడమేనన్న చర్చ ఉంది. ఇదిలావుంటే.. ఇప్పుడు మరో ఉద్యమానికి పిలుపు ఇచ్చారు. కానీ, ఇంతలోనే కోడ్ నేపథ్యంలో వెనక్కి తప్పుకొన్నారు.
కానీ, వాస్తవానికి జగన్ లేని ఉద్యమాలు.. నిరసనలు విఫలమవుతున్నాయన్న చర్చ కొనసాగుతుండడం తోనే ఇలా జరుగుతోందన్న చర్చ ఉంది. దీనికి కారణం.. ప్రజల మధ్యకు వచ్చేందుకు.. రోడ్డెక్కి కూర్చు నేందుకు కూడా జగన్ భియపడుతున్నారన్న వాదన సోషల్ మీడియాలో వినిపిస్తోంది. గత ఐదేళ్లు జగన్.. ముఖ్యమంత్రిగా విలాసవంతమైన జీవితం గడిపిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. ఎటు వెళ్లినా మందీ మార్బలంతోపాటు.. చెట్లు నరికేయడం.. వంటివాటిని గుర్తు చేస్తున్నారు.
అలా ఒక రాజసం ఉట్టిపడిన విధంగా వ్యవహరించిన జగన్.. ఇప్పుడు ప్రజల మధ్యకు వచ్చి.. రోడ్డెక్కేం దుకు మానసికంగా ఇబ్బంది పడుతున్నారని.. చెబుతున్నారు. గత ఐదేళ్ల సీఎం భోగమే ఆయనకు గుర్తు కు వస్తోందని అంటున్నారు. కానీ, వాస్తవానికి జగన్కు ఉద్యమాలు, నిరసనలు కొత్తకాదు. అనేక ఉద్యమా లుచేశారు. అనేక యాత్రలు చేసి ప్రజల మధ్యకు కూడా వెళ్లారు. అలాంటి నేత.. ఇప్పుడు వెనుకడుగు వేయడం వెనుక.. బహుశ ఇదే కారణం అయి ఉంటుందని అంటున్నారు. కానీ, చంద్రబాబు దీనికి భిన్నం. తాను సీఈవో అనే ముద్ర వేసుకున్నా.. మాస్ వ్యవహారాల్లో చంద్రబాబు తన వ్యాఖ్యలు, నిరసనల ద్వారా ప్రజలకు చేరువ అయ్యారు.