లండన్ ఎన్నారై ‘జై కుమార్ గుంటుపల్లి’ ఒక వినూత్న ఆలోచన కు శ్రీకారం చుట్టారు.
యూరప్ లో విజయవంతమైన ‘యూరో కార్ట్’ లను ఆంధ్రప్రేదశ్ లోని చిరు వ్యాపారులకు పరిచయం చేయాలని ఆయన సంకల్పించి, ఎన్నారై టీడీపీ అధినేత ‘డాక్టర్ రవి వేమూరి’ తో చర్చించారు.
ఆ ప్రతిపాదనకు జై కుమార్ ఆర్థికంగాను అండగా నిలిచారు.
ఈ సంకల్పానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ‘నారా లోకేష్’ వెన్నుతట్టారు.
అందుకే, ప్రయోగాత్మకంగా మంగళగిరి లో ‘యూరో కార్ట్’ లను కొంతమంది చిరు వ్యాపారులకు, ‘నారా లోకేష్’ స్వయంగా అందించి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఐరోపాలో ప్రజలు చిరు వ్యాపారులు, ‘తోపుడు బండ్ల (కార్ట్)’ ల నుంచి ఆహారాన్ని నిస్సంకోచంగా కొంటుంటారు.
ఆ ‘యూరో కార్ట్’ ల ద్వారా కొనుగోలు చేసే ఆహారం, పదార్థాలు సురక్షితమైనవని ప్రజలు నమ్ముతారు.
అందుకే, ఆ ‘యూరో కార్ట్’ లను ఆంధ్రప్రదేశ్ కు పరిచయం చేయాలని సంకల్పించారు.
ఏపీలోని చాలామంది వీధి వ్యాపారుల దగ్గర, తోపుడు బండ్లు, ఫుడ్ స్టాల్స్ దగ్గర ఆహారం పరిశుభ్రంగా ఉండదు అన్న భావనను తొలగించాలన్న ఉద్దేశ్యంతోనే ‘యూరో కార్ట్’ లను ఏపీకి పరిచయం చేశారు.
ఈ ‘యూరో కార్ట్’, ఇటు కస్టమర్లకు అటు వ్యాపారులకు ఇరువురికి ప్రయోజనకరంగా ఉంటుంది.
ఆ ‘యూరో కార్ట్ ల ద్వారా చిరు వ్యాపారుల ఆదాయం కచ్చితంగా పెరుగుతుంది.
ఈ యూరో కార్ట్ ‘ల వలన తోపుడు బళ్లను అద్దెకు ఇచ్చచే స్థానిక మాఫియాను కూడా నిర్మూలించవచ్చు.
అంతేకాకుండా, చిరువ్యాపారులు కూడా రుణ విముక్తులవుతారు.
ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని, ‘నారా లోకేష్’ తన నియోజకవర్గం మంగళగిరిలో ప్రయోగాత్మకంగా ప్రారంభించి కొందరు చిరు వ్యాపారులకు ‘యూరో కార్ట్’ లను అందించారు.