ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ కు హైదరాబాద్ జీహెచ్ఎంసీ అధికారులు షాకిచ్చారు. లోటస్ పాండ్ లోని జగన్ నివాసం దగ్గర ఉన్న అక్రమ కట్టడాలని జీహెచ్ఎంసీ అధికారులు తొలగించిన వైనం చర్చనీయాంశమైంది. జగన్ భద్రత పేరుతో గతంలో నిర్మించిన సెక్యూరిటీ అవుట్ పోస్టు కట్టడాలకు అనుమతులు లేవని ఫిర్యాదులు రావడంతో అధికారులు స్పందించారు.
రోడ్డును ఆక్రమించి ప్రజలకు అసౌకర్యం కలిగించేలా ఈ నిర్మాణాలు చేపట్టారని, ఆ నిర్మాణాలు ట్రాఫిక్ కు ఇబ్బందికరంగా మారాయని ఫిర్యాదులు అందడంతో చర్యలు చేపట్టారు. ఆ ఫిర్యాదులపై స్పందించిన జీహెచ్ఎంసీ అధికారులు జగన్ నివాసం ఎదుట ఉన్న పలు నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేశారు. ఫుట్పాత్ లను ఆక్రమించి నిర్మించిన సెక్యూరిటీ పోస్ట్ లు, భారీ ఎత్తున నిర్మించిన హోర్డింగులు, ప్రహరీ గోడలు, వాహనాల పార్కింగులు(టూ వీలర్) కూల్చివేశారు. గత నెలలోనే అధికారులు ఈ అక్రమ కట్టడాలపై నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. స్పందించకపోవడంతో కూల్చి వేతలు చేపట్టారు.
లోటస్ పాండ్ వెనుక ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఆఫీసు ఉంది. అది కూడా అక్రమ కట్టడమే అంటున్నారు. ఏది ఏమైనా జీహెచ్ఎంసీ చర్యలపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై, ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోయినట్లేనని సంతోషిస్తున్నారు.
Illegal Structures Demolished Near Jagan's House in Hyderabad
The Greater Hyderabad Municipal Corporation (GHMC) demolished illegal structures in front of Y.S. Jagan Mohan Reddy's residence in Lotus Pond today. The unauthorized constructions, intended for Jagan's security, had… pic.twitter.com/tPCTZXJW1H
— Sudhakar Udumula (@sudhakarudumula) June 15, 2024