ఎలాన్ మస్క్.. ఈ పేరు తెలియనివారు ఎవరూ లేరు. టెస్లా విద్యుత్ కార్లతో సరికొత్త మార్పులను ఈ ప్రపంచానికి పరిచయం చేసిన మస్క్.. ప్రపంచ కుబేరుడిగా మరింత గుర్తింపు పొందారు. ఇదిలావుంటే.. తాజాగా ఆయన మరోసారి సంచలనం సృష్టించారు. తన చేతిలోని ఓ కంపెనీని.. తనకే విక్రయించుకుని విస్మయానికి గురి చేశారు. ఈ విషయంపైనే ప్రస్తుతం ప్రపంచం దృష్టి పెట్టింది. ఇది కూడా సాధ్యమేనా? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
రెండేళ్ల కిందట మస్క్ అప్పటి వరకు `ట్విట్టర్` పేరిట ఉన్న సామాజిక మాధ్యమాన్ని.. కొనుగోలు చేశారు. అప్పట్లో అది 44 బిలియన్ డాలర్లకు ఆయన కొన్నారు. ఆ వెంటనే అనేక మార్పులు చేశారు. సామాజిక మాధ్యమాన్ని భారీ వ్యాపార వస్తువుగా మార్పు చేశారు. బ్లూటిక్కుల వ్యవహారం.. దీనికి సంబంధించి రుసుములు ఏర్పాటు చేసిన తీరు తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఇక, ట్విట్టర్‌కు ఆయన ఎక్స్ పేరును కూడా జోడించారు. ఇలా వినూత్న ప్రదర్శించి.. మస్క్ నిరంతరం వార్తల్లో నిలిచారు.
ఇదిలావుంటే.. తాజాగా ఈ ఎక్స్ మాధ్యమాన్ని విక్రయించారు. అయితే.. అదిఎవరో బయటివ్యక్తులకు కాకుండా.. తనకు చెందిన, తన యాజమాన్యంలోని `ఎక్స్ ఏఐ` సంస్థకే విక్రయించుకోవడం గమనార్హం. దీనిని 33 బిలియన్ డాలర్లకే విక్రయించుకున్నట్టు మస్క్ ప్రకటించారు. అంటే.. ఆయన కొనుగోలు చేసిన 44 బిలియన్ డాలర్లతో పోల్చుకుంటే.. 10 బిలియన్ డాలర్ల కంటే తక్కువగే సొంతగా విక్రయించుకోవ డం.. కొనుగోలు చేయడం గమనార్హం. ఇలా ఎందుకు చేశారన్నది.. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తు న్న ప్రశ్న.
ఎక్స్ఏఐ అధునాత ఏఐ సామర్థ్యాన్ని, ఎక్స్‌కు అనుసంధానించడం ద్వారా ఉత్తమ ఫలితాలు రాబట్టవ చ్చని మస్క్ అంటున్నారు. అయితే.. వాస్తవం వేరేగా ఉందని.. కంపెనీల నుంచి కట్టే కార్పొరేట్ ట్యాక్సులు, సుంకాలను తగ్గించుకునేందుకు మస్క్ ఇలా చేసి ఉంటారన్న అభిప్రాయం వ్యాపార వేత్తల్లో వినిపిస్తుండడం గమనార్హం. మరి వాస్తవం ఏంటనేది తెలియాల్సిఉంది.