అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో అప్పుడే వింత రాజకీయాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని తెలియడంతో.. కొన్ని గంటల ముందు రెండు పెద్దరాష్ట్రాల్లోని అధికార పార్టీలు.. ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు ప్రయత్నించాయి.
మరికొద్ది గంటల్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటిస్తారని తెలిసి.. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రజలకు మోడీ ఎన్నికల తాయిలా లు ప్రకటించారు. దీంతోఇప్పుడు ఆ రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలపై చర్యలు తీసుకోవాలని కేంద్రంలోన బీజేపీ పెద్దలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేయడం చర్చనీయాంశంగా మారింది.
ఇలా వరాలు.. అలా కోడ్!!
విషయంలోకి వెళ్తే.. తాజాగా తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అసోం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నిక ల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఆ వెంటనే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చేసింది. ఇక, రాజకీయ నేతలు, పార్టీలు.. ప్రభు త్వా లు.. ప్రజలను ఆకట్టుకునేందుకు ఎలాంటి పథకాలు ప్రకటనలు చేసేందుకు అర్హత కోల్పోతారు. అయితే.. ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టిన రెండు పెద్ద రాష్ట్రాలైన తమిళనాడు, బెంగాల్ రాష్ట్రాల్లో ప్రబుత్వాలు.. వెంటనే ప్రజలపై వరాల జల్లు కురిపిం చాయి. ప్రస్తుతం ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
తమిళనాడులో..
కరోనా సమయంలో కుటుంబాలను గడుపుకొనేందుకు ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని కుదువ పెట్టి తెచ్చుకున్న రుణాలను తమిళనాడు ప్రభుత్వం రద్దు చేసింది. ఇది కూడా ఎన్నికల కోడ్ మరికొన్ని గంటల్లో వస్తుందనగా సీఎం పళని స్వామి స్వయంగా ప్రకటన జారీ చేశారు. సహకార సంఘాల్లో ఆరు సవర్ల బంగారాన్ని తాకట్టుపెట్టిన వారికి రుణాన్ని రద్దు చేస్తూ సీఎం నిర్ణయం తీసుకున్నారు. కోవిడ్ కారణంగా ఆర్థిక వ్యవస్థ ఇంకా కోలుకోలేదని, ఈ నిర్ణయం వల్ల పేద ప్రజలు తమ బంగారాన్ని తిరిగి పొందడానికి వీలు కల్పించినట్లవుతుందని పేర్కొన్నారు.
బెంగాల్లో..
మరో పెద్ద రాష్ట్రం.. పశ్చిమ బెంగాల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు కొన్ని గంటల ముందు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో ఎక్కువగా ఉన్న, కీలక ఓటు బ్యాంకు అయిన దినసరి కూలీల వేతనాన్ని పెంచుతూ మమత సర్కార్ నిర్ణయం తీసుకుంది. నైపుణ్యంలేని కూలీల దినసరి వేతనం 44 రూపాయల నుంచి 202 రూపాయలకు పెంచుతూ నిర్ణయించుకున్నారు. నైపుణ్యం ఉన్న కూలీల దినసరి వేతనాన్ని 172 రూపాయల నుంచి 404 రూపాయలకు పెంచుతూ మమత సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నిర్ణయాలు ఎన్నికల్లో ఓట్ల కోసమేనని.. వీటిని రద్దు చేయాలని ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం గమనార్హం. అదేసమయంలో కేంద్రం కూడా ఫిర్యాదు చేసింది.