మనీ లాండరింగ్ కేసులో ఆర్థిక నేరగాడు సుఖేశ్ చంద్రశేఖర్ కొద్ది రోజుల క్రితం అరెస్టయిన సంగతి తెలిసిందే. వందల కోట్ల హవాలాకు సుఖేశ్ పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. అయితే, సుఖేశ్ కు బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తో సంబంధాలున్నాయని, మనీ ల్యాండరింగ్ ద్వారా వచ్చిన డబ్బులో చాలా వరకు జాక్వలిన్ కు చేరిందని ప్రచారం జరిగింది. దీంతో సుఖేశ్ పై నమోదైన రూ.200 కోట్ల మనీ ల్యాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ పేరును కూడా ఈడీ చేర్చింది.
జాక్వెలిన్ కు సుఖేశ్ చంద్రశేఖర్ రూ.7 కోట్లకు పైగా నగలు బహుమతిగా ఇచ్చాడని ఆరోపణలు వచ్చాయి. ఈ అమ్మడిపై గతంలోనే కేసు నమోదు చేసిన ఈడీ…తాజాగా ఛార్జిషీట్లో మరిన్ని సంచలన విషయాలను పేర్కొంది. జాక్వెలిన్ స్వదేశం శ్రీలంకలో ఆమె కోసం సుఖేశ్ ఓ ఇల్లు కొనుగోలు చేసినట్లు ఈడీ విచారణలో తేలింది. అదే తరహాలో ముంబైలో అత్యంత ఖరీదైన జుహు ప్రాంతంలో కూడా జాక్వలిన్ కోసం ఓ బంగ్లా కొనేందుకు సుఖేశ్ అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. ఇక, జాక్వెలిన్ తల్లిదండ్రుల కోసం బహ్రెయిన్ లో ఓ ఇల్లు కూడా గిఫ్ట్ గా ఇచ్చాడట సుఖేశ్.
తన సహచరుడు పింకీ ఇరానీకి ఆ ఇళ్ల కొనుగోళ్ల వ్యవహారం అప్పజెప్పినట్లు తెలుస్తోంది. ఇక, సుఖేశ్ కు జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ను ఇరానీనే పరిచయం చేశాడట. తనకు బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ను పరిచయం చేసిన ఇరానీకి సుఖేశ్ కోట్ల రూపాయలు ముట్టజెప్పాడట.
ఈ ఇళ్ల కొనుగోళ్లు, ఆస్తుల వివరాలపై జాక్వెలిన్‌ను ఈడీ అధికారులు ప్రశ్నించారట. సుఖేశ్ తన కోసం శ్రీలంకలో కొత్త ఇల్లు కొన్నాడని పింకీ ఇరానీతో వాట్సాప్ చాట్ చేసినట్లు కూడా జాక్వెలిన్ ఒప్పుకుందట.
శ్రీలంకలో శ్రీలంకలో ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ వెలిగామాలో ఆ ఇల్లును కొనుగోలు చేశాడని, కానీ, తాను అక్కడికి వెళ్లలేదని ఆమె అంగీకరించిందట. తనకు, లేదా తన బంధువులకు మరిన్ని ఆస్తులు కొనుగోలు చేయాలని కూడా సుఖేశ్ ప్లాన్ చేశాడట. ఈ ఆస్తులను సుఖేశ్ నిజంగానే కొనుగోలు చేశాడా? లేక జాక్వెలిన్ కు అతను అబద్ధం చెప్పాడా? అనే విషయాన్ని ఈడీ ఇంకా నిర్ధారించలేదు. ఇక, ఈ కేసు విచారణలో భాగంగా ఈ నెల 26న తమ ముందు హాజరు కావాలంటూ ఢిల్లీ హైకోర్టు జాక్వెలిన్‌కు నోటీసులు జారీ చేసింది.
Comments 1