దుబ్బాకలో ఏ పార్టీకి ఎన్ని ఓట్లు?
ఉప ఎన్నికలో దుబ్బాక గెలవడం వెనుక కారణాలు ఎవరికీ అర్థం కావడం లేదు. టీఆర్ఎస్ అధికారంలో ఉండగా, సానుభూతి ఓటు ఉండగా... టీఆర్ఎస్ బలంగా ఉన్న చోట గతంలో 62000 మెజారిటీ వచ్చిన చోట బీజేపీ గెలవడం ఒక వింత.
ఇది బీజేపీ గెలుపు అనడం కంటే టీఆర్ఎస్ ఓటమి అనడం కరెక్టు. జనంలో టాక్ కూడా అదే. రఘునందన్ రావు ఇక్కడ బీజేపీ అభ్యర్థి. ప్రజాదరణ ఉన్న సోలిపేట పాత ఓటింగ్ కూడా ఆయన భార్యకు పడలేదు.
తాజా ఓటింగ్ లో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో చూద్దాం
రఘునందన్ రావు, బీజేపీ - 62,772
సోలిపేట సుజాత, టీఆర్ఎస్ - 61302
చెరుకు శ్రీనివాస్ రెడ్డి, కాంగ్రెస్ - 21,819
మెజారిటీ 1470