ముద్దుల భార్య కోసం భర్తలు పడే కష్టం అంతా ఇంతా కాదు. సాదాసీదా భర్తలే ఇంతలా చేస్తున్నప్పుడు మిలియనీర్ అయిన భర్త అయితే ఏం చేస్తాడు? అన్న ప్రశ్నకు సమాధానం చెబుతుందీ ఉదంతం. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ ఉదంతం ఇప్పుడు అందరిని ఆకర్షిస్తోంది. భార్య మీద భర్తలు చూపే ప్రేమాభిమానాలకు కొత్త కొలమానంగా మారిందంటూ నవ్వుతూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకూ ఈ బిలియనీర్ భర్త ఎవరు? భార్య కోసం ఏం చేశాడు? లాంటి వివరాల్లోకి వెళితే..
దుబాయ్ కు చెందిన మిలియనీర్ కం బిజినెస్ మ్యాన్ అయిన జమాల్ అల్ నదాక్ తన ముద్దుల భార్య మురిపెం తీర్చటానికి సంచలన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆమె సౌకర్యవంతంగా బికినీ ధరించేందుకు వీలుగా ఆయన ఒక ఐలాండ్ నే ఏకంగా కొనేశారు. ఇందుకోసం రూ.418 కోట్లు ఖర్చు చేశారు. జమాల్ అల్ నదాక్ భార్య పేరు సౌదీ అల్ నదాక్. తన కోసం భర్త చేసిన పని గురించి ఆమె గొప్పగా చెప్పేసుకున్నారు.
హిందూ మహాసముంద్రంలో ఒక ఐలాండ్ ను కొనుగోలు చేశారు. ఇందుకోసం 50 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. తన భర్త తనపట్ల ప్రదర్శించిన ప్రేమను దాచుకోని ఆమె.. ఇన్ స్టా వేదికగా వీడియోలో షేర్ చేసింది. తాను బికినీ ధరించినప్పుడు సౌకర్యవంతంగా ఉండేందుకుఒక ద్వీపాన్ని కొనుగోలు చేసిన విషయాన్ని స్వయంగా వెల్లడించారు. ‘దీర్ఘకాల పెట్టుబడిపై మేం ఇద్దరం ఆలోచించాం. ఆ టైంలో ప్రైవసీ పైనా ఫోకస్ చేశాం. నేను బీచ్ లో సేఫ్ గా సేద తీరాలన్నదే నా బర్త కోరిక. అందులో నుంచే ఐలాండ్ ను సొంతం చేసుకోవాలనే ఆలోచన వచ్చింది’’ అంటూ ఆమె పేర్కొన్నారు.
ఇంతకూ వీరు కొన్న ఐలాండ్ ఎక్కడ? అన్న ఆరా తీస్తే.. ఆసియా ఖండంలోనే అని చెబుతున్నా.. స్పష్టంగా ఫలానా ప్లేస్ లో అన్న విషయాన్నిమాత్రం వెల్లడించటం లేదు. ఎప్పటిలానే ఈ ఉదంతం మీద సోషల్ మీడియాలో బోలెడన్ని కామెంట్లు వెల్లువెత్తాయి. ఇలాంటి భర్త ఎక్కడ దొరుకుతాడు? అని ఒకరు ఫన్నీగా ప్రశ్నిస్తే.. ఇంత ఖర్చు చేసిన ఆ సంపన్నుడికి చార్టర్డ్ ఫ్లైట్ ఎందుకు లేదో? అంటూ మరో లాజికల్ క్వశ్చన్ ను సంధించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భార్య బికినీ వేసుకోవటానికి ఎలాంటి ఇబ్బంది పడకుండా భర్త కొన్న ఐలాండ్ కు సంబంధించిన అధికారిక వివరాలు మాత్రం వెల్లడి కాలేదు.