ఏపీలో నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తయింది. ఆంధ్రప్రదేశ్ ఎన్ఆర్టీ సొసైటీ (APNRTS) ఛైర్మన్ గా డా.రవి వేమూరు మరోసారి నియమితులయ్యారు. 2014-19 మధ్య ఏపీ ఎన్నార్టీఎస్ ఛైర్మన్ గా పనిచేసి విశేష సేవలందించిన రవి వేమూరుకు మరోసారి సీఎం చంద్రబాబు అవకాశమిచ్చారు. తెనాలికి చెందిన రవి వేమూరు ఎన్నారై టీడీపీ నేతగా చాలా ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. రెండోసారి ఏపీఎన్నార్టీఎస్ ఛైర్మన్ గా ఎంపికైన డాక్టర్ రవి వేమూరుకు నమస్తే ఆంధ్ర తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.