విజయవాడలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.
సుమారు నగర పరిధిలోని 40 కాలనీలలో వరద నీరు ముంచెత్తడంతో వేలాది కుటుంబాలు నిరాశనులై రోడ్డున పడ్డారు.
వీటన్నిటిని చూసి చెల్లించిన తిరుపతికి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సమస్త ఆయన డాలర్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ డాక్టర్ సి. దివాకర్ రెడ్డి 10 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసి తన ధాతృత్వాన్ని చాటుకున్నారు.
ఈ మేరకు శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయనున్న చెక్కును డాలర్స్ గ్రూప్ ఆఫ్ చైర్మన్ దివాకర్ రెడ్డి ప్రకటించారు.
ఈ సందర్భంగా దివాకర్ రెడ్డి మాట్లాడుతూ వరదల వల్ల ఇలాంటి విపత్కర పరిస్థితి విజయవాడ నగరానికి రావడం దారుణం అన్నారు.
ఎన్నో వేల కుటుంబాలు రోడ్డున పడటంతో తన మనసు చలించిందని, దీంతో తన వంతుగా 10 లక్షల రూపాయలు సీఎం సహాయ నిధికి వరద బాధితుల సహాయార్థం ఇచ్చేందుకు ముందుకు రావడం జరిగిందన్నారు.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ వరద బాధితుల సహాయార్థం స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు 74 ఏళ్ల వయసులోనూ రాత్రింబొళ్ళు వరద ప్రాంతాలలో పర్యటించు ప్రజలకు భరోసా కల్పించడంతోపాటు వారికి కావాల్సిన వస్తువులను అందజేయడం జరుగుతోందని చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజు వరద ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు అన్ని సేవలు అందుతున్నాయా లేదా నిత్యం పరిరక్షిస్తున్నారని అలాంటి సీఎం మరి ఎక్కడ ఉండరని పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రయోజనాల కోసం సేవ చేసేందుకు చంద్రగిరి నియోజకవర్గ ఎప్పుడు ఎల్లప్పుడూ ముందుంటుందని డాలర్స్ దివాకర్ రెడ్డి చెప్పారు.
ఈ సమావేశంలో చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.