డాలర్ దివాకర్ రెడ్డి అంటే చంద్రగిరి నియోజకవర్గం లో మరియు ఆ చుట్టుపక్కల ప్రాంతాల వారికి ఆయన ఒక రియల్ ఎస్టేట్ కింగ్ అని మాత్రమే తెలుసు.
కానీ చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే ఆయన ఒక గొప్ప సంఘ సంస్కర్త అని, ఎంతోమందికి గుప్త దానాలు చేశారు అని , ఆయన చేసిన ఏ సహాయాన్ని బయటికి చెప్పలేదు అని.
ఆయన ద్వారా లబ్ధి పొందిన వారు ఎంతోమంది ఇప్పటికీ ఆయన పట్ల కృతజ్ఞత గా ఉంటారు.
అందుకనే డాలర్ దివాకర్ రెడ్డి కి యువతలో అంత క్రేజ్ ఉంది, ఆయన రాజకీయాల్లోకి రాకమునుపే తనకంటూ ఒక పేరును సంపాదించుకొని తనకు తానే ఒక బలం అయ్యాడు.
అయితే ఇప్పుడు డాలర్ దివాకర్ రెడ్డి టీడీపీ కండువా కప్పుకొని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగారు.
చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ పార్టీ జెండా ఎగిరేలా అన్ని రకాలుగా ప్రచారం చేస్తున్నారు.
అయితే ఆయన పార్టీలో చేరిన సందర్భంగా ఈ రోజు తన అనుచర వర్గంతో అభిమానులతో కలిసి ఒక ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఎప్పుడైతే ఈ ఆత్మీయ సమావేశానికి డాలర్ దివాకర్ రెడ్డి పిలుపునిచ్చారో ఆ క్షణం నుండి చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న ఎంతో మంది యువత, అభిమానులు అందరూ ఆయన సమావేశానికి తరలివచ్చారు.
కాలూరు సెంటర్ వద్ద డాలర్ దివాకర్ రెడ్డి గారి అభిమాన ప్రవాహం కనపడింది.
కొన్ని క్షణాల పాటు ఆ సెంటర్ స్తంభించిపోయింది.
అంత మంది యువత డాలర్ దివాకర్ రెడ్డి ని కలవడానికి వచ్చారు.
దీనితో పాటు డాలర్ దివాకర్ రెడ్డి B.G.R కళ్యాణ మండపంలో జరిగిన ఆత్మీయ సమావేశంలో పులివర్తి సుధా రెడ్డి మరియు పులిపర్తి వినీల్ పాల్గొని టిడిపి పార్టీ విజయం కోసం డాలర్ దివాకర్ రెడ్డి ఎంత కృషి చేస్తున్నారో చెప్పారు.
అంతే కాదు ఈసారి చంద్రగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎగర పోతుందని ధీమా వ్యక్తం చేశారు.
ఆ సమావేశంలోనే చాలా మంది యువత టిడిపిలో చేరడం జరిగింది.
తాను నమ్మిన పార్టీకి వెన్నుముకగా ఉంటూ ఎలాంటి పదవి ఆశించకుండా ఉన్న మనిషికి ఇంతమంది అభిమానం దొరకడం అందర్నీ ఆశ్చర్యపరచింది
ఇక చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ గెలుపుని ఆపడం ఎవ్వరి వల్ల కాదు.