ఏపీలో రాజకీయాలు మరోసారి హీటెక్కాయి. అయితే.. ఈ రాజకీయం అంతా వైసీపీ అధినేత జగన్ చుట్టూ తిరుగుతుండడం గమనార్హం. తాజాగా ఆయన పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు.. సర్వత్రా విస్మయాన్ని కలిగి స్తుండడంతోపాటు చర్చనీయాంశం కూడా అయ్యాయి. తమకు ఎలానూ మాట్లాడే అవకాశం ఇవ్వరు కాబట్టి.. తమపై కూటమి సర్కారు కత్తికట్టు వ్యవహరిస్తోంది కాబట్టి.. తాము అసెంబ్లీకి వెళ్లి మాత్రం ఏం చేయాలన్నది జగన్ ప్రశ్న.
అంటే.. దీనిని బట్టి జగన్ సహా వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలు సభకు డుమ్మా కొట్టడం ఖాయమనేది స్పష్టం గా తెలుస్తోంది. గతంలో రెండు సార్లు సభ పెట్టినప్పుడు కూడా కేవలం రెండు మాత్రమే వచ్చి వైసీపీ నాయకులు వెళ్లిపోయారు. ఇక, ఇప్పుడు పూర్తిస్థాయిలో సభ నిర్వహించాలని చూడడంతోపాటు.. బడ్జెట్ను కూడా సమావేశాల్లో ప్రవేశ పెట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. దీంతో ఈ నెల 11 నుంచి సభలకు శ్రీకారం చుట్టారు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. ఇక, వివిధ రాజకీయ పార్టీల నాయకులు జగన్ నిర్ణయంపై విమర్శలు గుప్పిస్తున్నారు. సభకు రాని జగన్కు పార్టీ ఎందుకు? అంటూ.. టీడీపీ ఎమ్మెల్సీ ఒకరు నిప్పులు చెరిగారు. “సభకు రారు. ప్రజల సమస్యలపై స్పందించరు. సొంత నియోజకవర్గం పులివెందులలో ఏం జరుగుతోందో కూడా తెలియదు. అలాంటి సమయంలో జగన్కు పార్టీ ఎందుకు? “ అనే ప్రశ్న తలెత్తుండడం గమనార్హం.
ఇక, ఇదే విషయంపై నెటిజన్లు కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. సభకు రాని జగన్కు పార్టీ ఎందుకన్న టీడీపీ ఎమ్మెల్సీ రాం గోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో మెజారిటీ నెటిజన్లు ఏకీభవించడం గమనార్హం. ఔను.. జగన్కు పార్టీ ఎందుకు? అని పలువురు ప్రశ్నించారు. తక్కువ ఎక్కవ అనేది ముఖ్యం కాదని.. ప్రజలు ఓట్లు వేసి గెలిపించారా? లేదా? అనేది ప్రధామని పేర్కొన్నారు. 38 శాతం ఓట్లు పడిన పార్టీ ఇలా సభకు వెళ్లకపోతే.. రెండు రకాలుగా ఇబ్బందులు తప్పవని అంటున్నారు. 1) ప్రజల్లో మరింత చులకన కావడం, 2) ప్రభుత్వ వర్గాలు కూడా పట్టించుకోకపోవడం వంటివి జరుగుతాయని అంటున్నారు.