అసలే మండుతున్న ఎండలు. 45 డిగ్రీల ఊష్ణోగ్రతలు దాటిపోతున్నాయి. తొలి మూడు దశలలో ఓటింగ్ శాతం అమాంతం తగ్గడంతో ఎన్నికల కమీషన్ పలు రాష్ట్రాలలో ఓటింగ్ సమయాన్ని పొడిగించింది. కొన్ని రాష్ట్రాలలో ఎన్నికల అధికారులు ఓటర్లను పోలింగ్ బూతుకు రప్పించేందుకు ఏకంగా ఆకర్షణీయమైన బహుమతులను కూడా లక్కీ డ్రా ద్వారా డిస్కౌంట్ అందజేస్తామని ఉత్సాహం నింపే ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇక పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాలలో పోలింగ్ జరిగే రోజున ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును ప్రకటించాయి. ఓటింగ్ రోజున షాపింగ్ మాల్స్, పరిశ్రమలు, ఐటీ కంపెనీలు తెరిస్తే తీవ్ర చర్యలు ఉంటాయని ఎన్నికల కమీషన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దేశంలో అతిపెద్ద అమ్యూజ్ మెంట్ పార్క్ వండర్ లా ఒక బంపర్ అఫర్ ప్రకటించింది.
తమ ఓటును వినియోగించుకున్న వారు వారి వేలికి ఎన్నికల అధికారులు పెట్టిన సిరా గుర్తు చూపి వండర్ లాకు వస్తే టికెట్లపై 20 శాతం డిస్కౌంట్ ను ప్రకటించింది. ఓటు వేసిన తర్వాత మే 13, 14, 15 తేదీలలో ఓట్లు వేసిన వారు ఈ అఫర్ ను వినియోగించుకోవచ్చని, ఈ తేదీలలో ఆన్ లైన్, ఆఫ్ లైన్ బుకింగ్ లకు ఇది వర్తిస్తుందని వండర్ లా వెల్లడించింది. సందర్శకులు ఆన్లైన్ వెబ్సైట్: https://www.wonderla.com/ ద్వారా గానీ, లేదా 084 146 76333, +91 91000 63636కు కాల్ చేయటం ద్వారా ముందుగా తమ ఎంట్రీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.