గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ప్రముఖ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో రూపుదిద్దుకున్న లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ `గేమ్ ఛేంజర్`. చరణ్ ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించారు. శ్రీకాంత్, ఎస్.జె. సూర్య, సునీల్, సముద్రఖని, నవీన్ చంద్ర తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రను పోషించగా.. ఎస్.ఎస్. థమన్ సంగీతం అందించాడు. అత్యంత భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మాతమైన గేమ్ ఛేంజర్.. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది.
ఈ నేపథ్యంలోనే చిత్రబృందం ప్రచార కార్యక్రమాలను షురూ చేసింది. తాజాగా అమెరికాలోని డల్లాస్ లో గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను అట్టహాసంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి స్పెషల్ గెస్ట్ గా హాజరైన డైరెక్టర్ సుకుమార్.. గేమ్ ఛేంజర్ ఫస్ట్ రివ్యూ ఇచ్చేశారు. చిరంజీవి గారితో కలిగి తాను ఇప్పటికే సినిమా చూశానని.. ఫస్టాఫ్ అద్భుతంగా ఉందని సుకుమార్ కొనియాడారు.
అలాగే ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ అనే రేంజ్ లో ఉందని.. ఫ్లాష్ బ్యాక్ చూస్తున్నప్పుడు గూస్ బంప్స్ వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇక క్లైమాక్స్ సన్నివేశాల్లో రామ్ చరణ్ అవార్డ్ విన్నింగ్ పర్ఫామెన్స్ ఇచ్చాడని సుకుమార్ ప్రశంసలు కురిపించారు. గేమ్ ఛేంజర్ అద్భుతమైన విజయం సాధిస్తుందని నాతో పాటు చిరంజీవి గారు కూడా చాలా నమ్మకంగా ఉన్నారని సుకుమార్ తెలిపారు. కాగా, సుకుమార్ ఇచ్చిన ఈ రివ్యూ సినీ ప్రియుల్లో గేమ్ ఛేంజర్ పై మరిన్ని అంచనాలను పెంచేసింది. మెగా ఫ్యాన్స్ చరణ్ కు బిగ్ హిట్ ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు.