టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లిస్ట్ లో సుకుమార్ ముందు వరుసలో ఉంటారు. అటువంటి సుకుమార్ తాజాగా సినిమాలకు గుడ్ బై చెప్పేస్తా అంటూ షాకింగ్ స్టేట్మెంట్ ను పాస్ చేశారు. పుష్ప సిరీస్ తో సుకుమార్ కు నేషనల్ వైడ్ గా స్టార్ ఇమేజ్ లభించింది. ఇటీవల విడుదలైన పుష్ప 2 సంచలన విజయాన్ని నమోదు చేసింది. కానీ ఆ ఆనందమే లేకుండా పోయింది.
పుష్ప 2 బెనిఫిట్ షో సమయంలో సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతి చెందడం, ఆమె కుమారుడు శ్రీతేజ్ కోమాలోకి వెళ్లిపోవడం, ఆ ఘటన అల్లు అర్జున్ మెడకు చుట్టుకోవడం, ఆయన అరెస్ట్ కావడం, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా అల్లు అర్జున్ పై విమర్శలు చేయడం, ఇకపై బెనిఫిట్ షోలకు, సినిమా టికెట్ ధరల పెంపును అనుమతి ఇవ్వబోమని సీఎం ప్రకటించడం.. వంటి పరిణామాలన్నీ టాలీవుడ్ ను గందరగోళంలో పడేశాయి.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కారణంగా ఇప్పటికే అల్లు అర్జున్ చాలా ఇబ్బందులు పడుతున్నారు. వీటి ప్రభావమో ఏమో గానీ డైరెక్టర్ సుకుమార్ కూడా మానసికంగా చాలా కృంగిపోయినట్లు కనిపిస్తున్నారు. తాజాగా ఆయన చేసిన కామెంట్స్ ఇందుకు నిదర్శనం. ఇటీవల అమెరికాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన `గేమ్ ఛేంజర్` ప్రీ రిలీజ్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు సుకుమార్ స్పెషల్ గెస్ట్ గా హాజరయ్యారు. యూఎస్ ఈవెంట్ లో గేమ్ ఛేంజర్ నుంచి `దోప్` లిరిక్స్ తో సాగే సాంగ్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా యాంకర్ సుమ దోప్ అనే పదంతో ఒకటి వదిలేయాలి అంటే ఏం వదిలేస్తారు? అని సుకుమార్ ను ప్రశ్నించగా.. ఆయన `సినిమాలను వదిలేస్తా` అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. సుకుమార్ సమాధానం తో పక్కనే ఉన్న రామ్ చరణ్ తో సహా అందరూ షాక్ అయిపోయారు. వెంటనే చరణ్ మైక్ అందుకుని అది జరగదు అంటూ వ్యాఖ్యానించారు. మొత్తానికి ప్రస్తుత పరిణామాలు సుకుమార్ ను ఎంతగా డిస్టర్బ్ చేశాయో ఆయన మాటలతోనే స్పష్టంగా అర్థం అవుతుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.