‘బాహుబలి’ సినిమా నుంచి ప్రతి చిత్రానికీ లుక్స్ పరంగా వైవిధ్యం చూపిస్తూ వస్తున్నాడు ప్రభాస్. బాహుబలిలో ప్రభాస్ లుక్ సూపర్ అనే ప్రశంసలు వచ్చాయి. కానీ సాహో, రాధేశ్యామ్ చిత్రాల విషయంలో మాత్రం రెబల్ స్టార్ విమర్శలు ఎదుర్కొన్నాడు. సలార్, కల్కి సినిమాలకు మాత్రం లుక్ మెరుగుపడింది. ఆ కథలు, పాత్రలకు తగ్గట్లుగా అతను కనిపించాడు. ఇక లేటెస్ట్ మూవీ ‘రాజా సాబ్’లో ప్రభాస్ ఎంత స్టైలిష్‌గా కనిపిస్తున్నాడో చూస్తూనే ఉన్నాం.
యంగ్ లుక్‌తో పాటు రాజుగానూ ప్రభాస్ లుక్ ఆకట్టుకుంటోంది. ‘ఫౌజీ’ సినిమా కోసం హను ఎలాగూ ప్రభాస్‌ను మంచి లుక్‌లో ప్రెజెంట్ చేస్తాడనే నమ్మకాలున్నాయి. ఐతే ఇవన్నీ పక్కన పెడితే హీరోలకు అదిరిపోయే మేకోవర్ ఇస్తాడని పేరున్న సందీప్ రెడ్డి వంగ.. ‘స్పిరిట్’లో ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
‘అర్జున్ రెడ్డి’లో విజయ్ దేవరకొండ, ‘కబీర్ సింగ్’లో షాహిద్ కపూర్.. ‘యానిమల్’లో రణబీర్ కపూర్ తమ క్యారెక్టర్ల ట్రాన్స్ఫర్మేషన్కు తగ్గట్లుగా వేర్వేరు లుక్స్‌తో ఆకట్టుకున్నారు. మరి ‘స్పిరిట్’లో ప్రభాస్‌ను పోలీస్ పాత్రలో సందీప్ ఎలా చూపించబోతున్నాడని ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. ఆల్రెడీ ఫ్యాన్ మేడ్ పోస్టర్లు సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి.
ఐతే ప్రభాస్ లుక్ మీద ఇన్ డైరెక్ట్‌గా సందీప్ హింట్ ఇచ్చేస్తున్నట్లే కనిపిస్తోంది. సందీప్ చాలా ఏళ్ల నుంచి గుబురు గడ్డం, జులపాల జుట్టుతో కనిపిస్తూ వచ్చాడు. కానీ ఇప్పుడు జుట్టు తగ్గించాడు. లేటెస్ట్గా తన ఫ్రెంచ్ గడ్డాన్ని కూడా తీసేశాడు. మీసం మాత్రం పొడవుగా కనిపిస్తోంది. ప్రభాస్ లుక్ కూడా ఇలాగే ఉండొచ్చేమో అనే చర్చ జరుగుతోంది సోషల్ మీడియాలో. సందీప్ లుక్‌ను బట్టి ప్రభాస్ ‘స్పిరిట్’ లుక్‌ను ఎలా డిసైడ్ చేస్తారు అనిపించొచ్చు.
కానీ సందీప్.. తన సినిమాల్లో హీరో పాత్రలు ఎలాంటి అవతారంలో ఉంటాడు.. వాటి చిత్రీకరణ సమయంలో అలా మారిపోతాడు. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ సినిమాల మేకింగ్ టైంలో అతనెలా ఉన్నాడో గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఎన్నో ఏళ్ల నుంచి గడ్డం, భారీ జుట్తుతో ఉన్నవాడు.. ఇప్పుడు వాటిని తగ్గించి కొత్త లుక్కు మారాడు అంటే ‘స్పిరిట్’ కోసమే అని.. ప్రభాస్ కూడా ఇప్పుడు సందీప్ ఉన్న లుక్‌లోనే కనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.