టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్స్ లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ఆరంభం నుంచి వరుస హిట్స్ ను ఖాతాలో వేసుకుంటూ సత్తా చాటుతున్న అనిల్ రావిపూడి.. ఇటీవల `సంక్రాంతికి వస్తున్నాం` మూవీ తో మరో భారీ విజయాన్ని నమోదు చేశారు. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక అనిల్ రావిపూడి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ను మెగాస్టార్ చిరంజీవితో ప్రారంభించబోతున్నాడు. ఈ విషయం తాజాగా `లైలా` ప్రీ రిలీజ్ ఈవెంట్ లో స్పష్టమైంది.
విశ్వక్ సేన్ హీరోగా నటించిన లైలా ఫిబ్రవరి 14వ తేదీన విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలోనే ఆదివారం హైదరాబాద్ లో చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. ఈ ఈవెంట్ కు చిరంజీవి, డైరెక్టర్ అనిల్ రావిపూడి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంతో సందడిగా సాగిన ఈ ఈవెంట్ లో హోస్ట్ సుమ.. `వచ్చే జన్మలో అమ్మాయిగా పుట్టే అవకాశం వస్తే ఏ హీరోయిన్ గా పుట్టాలని మీరు కోరుకుంటారు?` అని అనిల్ రావిపూడికి వింత ప్రశ్న వేసింది.
అందుకు అనిల్ రావిపూడి.. `అప్పట్లో అయితే శ్రీదేవి లాగా ఇప్పుడైతే తమన్నా లాగా పుట్టాలని కోరుకుంటున్నాను` అని బదులిచ్చారు. అనిల్ రావిపూడి కామెంట్స్ కు అక్కడున్న అభిమానులు మరియు సినీ ప్రియులు అరుపులు, కేకలతో తెగ సందడి చేశారు. కాగా, లైలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా గురించి చిరంజీవి క్లారిటీ ఇచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తన నెక్స్ట్ ఫిల్మ్ సమ్మర్ లో స్టార్ట్ అవుతుందని.. ఇది పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని చిరు వెల్లడించారు.