సినిమాల సంఖ్య, రేంజ్, క్వాలిటీ ప్రకారం చూస్తే ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్ వన్ నిర్మాత అంటే దిల్ రాజే. ఆయన తెలుగులో దాదాపు అరడజను సినిమాలు నిర్మిస్తున్నారు. అవన్నీ పెద్ద స్థాయివే. ఐతే టాలీవుడ్లో ఈ ఆధిపత్యంతో రాజు సంతృప్తి చెందట్లేదు.
వేరే ఇండస్ట్రీల్లోనూ పాగా వేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆయా పరిశ్రమ స్టార్ హీరోలు, డైరెక్టర్లతో సినిమాలకు రంగం సిద్ధం చేస్తున్నారు. ముఖ్యంగా ఈ మద్య రాజు దృష్టి తమిళ హీరోలు, దర్శకుల మీద పడ్డట్లుంది.
రామ్ చరణ్ హీరోగా తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో రాజు ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. శంకర్‌తో సినిమా చేయాలని ఎన్నో ఏళ్లుగా ఎంతోమంది తెలుగు హీరోలు, నిర్మాతలు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది.
ఐతే శంకర్ దర్శకత్వంలో ‘ఇండియన్-2’ సినిమాను తనే నిర్మించడానికి ముందుకొచ్చి వెనక్కి తగ్గిన రాజు.. దాని తర్వాత శంకర్ చిత్రాన్ని తనే దక్కించుకున్నాడు. చరణ్‌తో సినిమాను కమిట్ చేయించాడు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తీయడానికి రాజు భారీ ప్రణాళికలతో సిద్ధమవుతున్నాడు.