టాలీవుడ్లో ఒక చిన్న డిస్ట్రిబ్యూటర్‌గా మొదలుపెట్టి.. టాప్ ప్రొడ్యూసర్‌గా దిల్ రాజు ఎదిగిన తీరు వర్ధమాన నిర్మాతలకు ఒక స్ఫూర్తి పాఠమే. ఎప్పటికప్పుడు ట్రెండుకు తగ్గట్లు తనను తాను అప్డేట్ చేసుకుంటూ.. ప్రొడ్యూస్ చేసే, డిస్ట్రిబ్యూట్ చేసే సినిమాల విషయంలో పక్కా క్యాల్కులేషన్స్తో ముందుకు సాగుతుంటాడు రాజు. తాజాగా ఆయన డిస్ట్రిబ్యూట్ చేసిన జైలర్ మూవీ భారీ లాభాలు తెచ్చిపెడుతోంది.
మరోసారి దిల్ రాజు జడ్జిమెంట్ స్కిల్స్ గురించి ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఐతే తెలుగులో గొప్ప ట్రాక్ రికార్డు ఉన్న రాజుకు.. హిందీలో మాత్రం కలిసి రాలేదు. తెలుగులో మంచి విజయం సాధించిన రెండు చిత్రాలను ఆయన హిందీలో వేరే నిర్మాతలతో కలిసి రీమేక్ చేస్తే అవి చేదు అనుభవాన్ని మిగిల్చాయి. ఆ చిత్రాలే.. జెర్సీ, హిట్. ఒరిజినల్స్ తీసిన డైరెక్టర్లతోనే రీమేక్ చేస్తే హిందీలో చేదు అనుభవాలు తప్పలేదు.
ఐతే ఆ రెండు చిత్రాలు పోయాయని దిల్ రాజు తన బాలీవుడ్ ఆశలకు తెరదించేయలేదు. ఈసారి రీమేక్ కాకుండా స్ట్రెయిట్ మూవీతోనే తిరిగి బాలీవుడ్లో అడుగు పెట్టనున్నాడట రాజు. తన హిట్ సినిమాను హిందీలో తీసిన శైలేష్ కొలనుతో ఈసారి స్ట్రెయిట్ మూవీ తీయనున్నాడట రాజు. ఈ చిత్రంలో సిద్దార్థ్ మల్హోత్రా కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం.
అతడితో శైలేష్ ఒక యాక్షన్ థ్రిల్లర్ తీయనున్నాడట. సినిమా ఓకే అయిందని.. త్వరలోనే లాంచ్ కూడా జరుగుతుందని అంటున్నారు. ప్రస్తుతం శైలేష్.. సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌తో సైంధవ్ మూవీ తీస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపు ప్రి ప్రొడక్షన్ పనులు చేయించి.. శైలేష్ ఖాళీ అయ్యాక సినిమాను సెట్స్ మీదికి తీసుకెళ్తారని సమాచారం.