రామోజీ ఫిల్మ్ సిటీలో జరగాల్సిన ‘బ్రహ్మాస్త్ర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హఠాత్తుగా క్సాన్సిల్ అయిన సంగతి తెలిసిందే. చివరి నిమిషంలో పోలీస్ శాఖ నుంచి అనుమతులు రాలేదని, వినాయక చవితి మండపాలు, ఇతర పనుల్లో పోలీసులు బిజీగా ఉండడంతో భద్రత కల్పించలేమని పోలీసులు పర్మిషన్ ఇశ్వలేదని చెబుతున్నారు. కానీ, ఈ ఈవెంట్ క్సాన్సిల్ కావడం వెనుక రాజకీయ కారణాలున్నాయని పుకార్లు వినిపిస్తున్నాయి.
ఇంకా చెప్పాలంటే, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ టార్గెట్ చేశారని, అందుకే, చివరి నిమిషంలో ఆ కార్యక్రమానికి పోలీసులు అనుమతి రద్దు చేశారని సోషల్ మీడియాలో పుకార్లు వస్తున్నాయి. ఇటీవల తారక్ తో కేంద్ర హోం శాఖా మంత్రి, బీజేపీలో నంబర్ 2గా కొనసాగుతున్న అమిత్ షా భేటీ కావడంపై కేసీఆర్ గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. అది రాజకీయ భేటీ అని, ‘రజాకార్ ఫైల్స్’ అనే చిత్రంలో నటించమని ఎన్టీఆర్ ముందు అమిత్ షా ఒక ప్రతిపాదన తీసుకొచ్చాని వదంతులు వ్యాపిస్తున్నాయి.
ఆగస్టు 25వ తేదీనే తాము పోలీసుల అనుమతి కోరామని, అధ్యాశ్రీ ఇన్ఫోటైన్ మెంట్ (శ్రేయాస్ మీడియా) తరఫున రాచకొండ సీపీ ఆఫీసులోని ఈవెంట్స్ విభాగంలో దరఖాస్తు చేశామని ఆ ఈవెంట్ సంస్థ తెలిపింది. శ్రేయాస్ మీడియా తప్పిదం వల్లే ఈవెంట్ రద్దయిందన్న ప్రచారం నేపథ్యంలో పోలీసులకు తామిచ్చిన లేఖను కూడా ఆ సంస్థ విడుదల చేసింది. అంతేకాదు, రామోజీ ఫిల్మ్ సిటీలో నాలుగైదు రోజుల నుంని జరుగుతున్న ఏర్పాట్లను స్థానిక సీఐ పర్యవేక్షించారని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారని తెలిపింది.
ఈ ఈవెంట్ క్యాన్సిల్ కావడంతో రెండున్నర కోట్ల నష్టం వాటిల్లిందట. ఆ ఈవెంట్లో ‘తొడ కొట్టు చిన్నా’ అని రణ్‌బీర్ అనగానే… ఎన్టీఆర్ తొడ కొట్టడం, ఆ తర్వాత ఫైర్ వర్క్స్ రావడం వంటివి ప్లాన్ చేయడానికి భారీ ఖర్చయిందట. అంతేకాదు, బందోబస్తు కోసం వచ్చే 800 మంది పోలీసులకు భోజనాల ఖర్చు, పార్క్ హయత్‌కు రావడానికి మరో పది పదిహేను లక్షలు ఖర్చు, రామోజీ ఫిల్మ్ సిటీలో ఈవెంట్ నిర్వహణకు రెండు కోట్ల పాతిక లక్షలు ఖర్చు అయ్యిందట.