విజయసాయి పైకి చెప్పులు విసిరిన భక్తులు
రామతీర్థం ఘటన జరిగిన రోజు గాని మరుసటి రోజుగాని స్పందించని వైసీపీ నేతలు, బీజేపీ నేతలు చంద్రబాబు రామతీర్థం పర్యటనతో ఉలిక్కిపడ్డారు. బాబు టూరు తెలిసిన వెంటనే విషయాన్ని డైవర్ట్ చేయడానికి విజయసాయి చంద్రబాబు కంటే ముందు రామతీర్థం గుడికి వెళ్లారు.
మరోవైపు ఇక్కడ గుడిలో రాముల వారి విగ్రహ తలను ధ్వంసం చేసిన నిందితులను పట్టుకోమని డిమాండ్ చేయాల్సిన బీజేపీ చంద్రబాబు హయాంలో విజయవాడ ఫ్లై ఓవర్ కోసం వేరే ప్రాంతాలకు తరలించిన గుళ్ల గురించి చర్చను మొదలుపెట్టింది. దీంతో వైసీపీని బీజేపీ రక్షించే ప్రయత్నం చేస్తోందని ఇపుడు నెటిజన్ల నుంచి విమర్శలు వచ్చాయి.
ఇదిలా ఉండగా... ఈరోజు విజయనగరం జిల్లాలోని రామతీర్థం రణరంగాన్ని తలపిస్తోంది. చంద్రబాబు పర్యటనకు కొన్ని గంటల ముందు రామతీర్థాన్ని సందర్శించిన వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తిరిగి వెళ్తుండగా... భక్తులు ఆగ్రహంతో చెప్పులు విసిరారు. దీంతో వైసీపీకి ఇది తీవ్ర అవమానంగా మారింది.
కొందరు రాళ్లు కూడా వేశారు. విగ్రహాల ధ్వంసాన్ని ఆపని ప్రభుత్వం సాయిరెడ్డిని పంపుతుందా అంటూ జనం తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు. భక్తుల ఆగ్రహానికి సాయిరెడ్డి కారు అద్దాలు పగిలిపోయాయి. దీంతో ఆయన మరో కారులో తిరిగి వెళ్లారు.
విజయసాయిరెడ్డి కారుపై చెప్పులు, ఇటుకలు విసిరిన రామ భక్తులు.. 😂😂
— _𝐂𝐁𝐍_𝐅𝐎𝐋𝐋𝐎𝐖𝐄𝐑𝐒_ (@_cbn_followers_) January 2, 2021
అప్పుడు భావప్రకటన స్వేచ్ఛ అయినప్పుడు..ఇప్పుడు కూడా ఇది భావప్రకటన స్వెచ్చే కదా.@VSReddy_MP pic.twitter.com/ofzYY1bqOu