దాదాపు ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి వస్తున్న సోలో రిలీజ్ `దేవర`. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ రెండు భాగాలుగా రాబోతుండగా.. దేవర పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాతో శ్రీదేవి ముద్దుల కూతురు జాన్వీ కపూర్ టాలీవుడ్ కు పరిచయం అవుతుండగా.. సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడి పాత్రను పోషించారు. ఇప్పటికే దేవర పై అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటు యావత్ భారతీయ సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. అంతకు తగ్గట్టుగానే చిత్రబృందం ప్రమోషన్స్ ను కూడా నిర్వహిస్తోంది. అయితే తాజాగా దేవర ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. ఎన్టీఆర్ కెరీర్లో సోలో హయ్యెస్ట్ బిజినెస్ చేసిన చిత్రంగా దేవర పార్ట్ 1 టాప్ ప్లేస్ లో నిలిచింది.
తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా థియేట్రికల్ రైట్స్ ను ఏకంగా రూ. 112.55 కోట్లకు విక్రయించారు. నైజాం ఏరియాలోనే ఏకంగా రూ. 44 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగింది. అలాగే కర్ణాటకలో రూ. 16 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరగగా.. తమిళనాడులో దేవర థియేట్రికల్ రైట్స్ ను రూ. 6 కోట్లకు కొనుగోలు చేశారు. కేరళలో రూ. 1 కోటి, హిందీ మరియు రెస్టాఫ్ ఇండియాలో రూ. 20 కోట్లకు ఎన్టీఆర్ సినిమా హక్కులు అమ్ముడుపోయాయి.
మొత్తంగా దేవర పార్ట్ 1 వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 182.25 కోట్లు. ఈ లెక్కన బాక్సాఫీస్ వద్ద సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే రూ. 184 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్స్ ను రాబట్టాల్సి ఉంటుంది. మరి ఇంత భారీ టార్గెట్ ను ఎన్టీఆర్ ఏ మేరకు రీచ్ అవుతాడో తెలియాలంటే దేవర రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.