జనతా గ్యారేజ్ అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్, డైరెక్టర్ కొరటాల శివ కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ `దేవర`. రూ. 300 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన ఈ చిత్రం.. సెప్టెంబర్ 27న భారీ అంచనాల నడుమ తెలుగుతో సహా మొత్తం ఐదు భాషల్లో అట్టహాసంగా విడుదలైంది. దివంగత నటి శ్రీదేవి పెద్ద కూతురు జాన్వీ కపూర్ దేవరతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. అయితే మొదట ఆట నుంచే మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ప్రేక్షకులకు పాయిజన్ మాదిరి ఎక్కేస్తోంది.
ఫలితంగా దేవర బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తోంది. తొలి రోజు అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. డే1, డే3 కూడా మంచి కలెక్షన్స్ తో ఎక్స్లెంజ్ హోల్డ్ ను కనబరిచింది. తాజాగా దేవర ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ బయటకు వచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే.. ఎన్టీఆర్ మూవీకి మొదటి రోజు రూ. 61.65 కోట్లు, రెండో రోజు రూ. 17.92 కోట్లు, మూడు రోజు రూ. 19.03 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. మొత్తం మూడు రోజుల్లో ఏపీ మరియు తెలంగాణలో రూ. 98.60 కోట్ల షేర్, రూ. 136.30 కోట్ల గ్రాస్ వసూళ్లను దేవర సొంతం చేసుకుంది.
వరల్డ్ వైడ్ గా ఫస్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యే టైమ్ కు అన్ని భాషల్లో కలుపుకుని దేవర రూ. 158.25 కోట్ల షేర్, రూ. 267.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను కొల్లగొట్టింది. ఓవర్సీస్ లో ఎన్టీఆర్ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటి వరకు అక్కడ రూ. 29.30 కోట్ల షేర్ వచ్చినట్లు ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి. కాగా, దేవర బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 184 కోట్లు. అయితే ఇప్పటి వరకు 85 శాతానికి పైగా రికవరీ అయిపోయింది. ఇంకా రూ. 25.75 కోట్ల షేర్ వస్తే దేవర సేఫ్ జోన్ లోకి వెళ్లిపోతుంది. బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలుస్తుంది.