నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఆరు సంవత్సరాల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా పర్ఫార్మ్ చేసిన దేవర చిత్రం నేడు విడుదలైంది. కొరటాల శివ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేయగా.. జాన్వీ కపూర్, సైఫ్ అలీ ఖాన్, శృతి మరాఠే, శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, మురళీ శర్మ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
తమిళ రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయిన దేవర.. ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది. కొందరు సినిమా బాగుందని అంటుంటే.. మరికొందరు యావరేజ్ అని చెబుతున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. దేవర నటీనటుల రెమ్యునరేషన్స్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.
దేవర సినిమాను మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ రూ. 300 కోట్ల బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు. రెమ్యునరేషన్స్ విషయానికి వస్తే.. తండ్రీకొడుకులుగా డ్యూయల్ రోల్స్ పోషించిన ఎన్టీఆర్ దేవర పార్ట్ 1 కోసం రూ. 60 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకున్నాడని తెలుస్తోంది. అలాగే మెయిన్ హీరోయిన్ అయిన జాన్వీ కపూర్ కు రూ. 5 కోట్లు, సెకండ్ హీరోయిన్ గా నటించిన శృతి మరాఠేకి రూ. 1 కోటి రెమ్యునరేషన్ ఇచ్చారట.
ప్రతినాయకుడి పాత్రను పోషించిన బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ రూ. 10 కోట్లు పారితోషికం తీసుకున్నాడట. ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించిన ప్రకాష్ రాజ్ కు రూ. 1.5 కోట్లు, శ్రీకాంత్ కు రూ. 50 లక్షలు, మురళీ శర్మకు రూ. 40 లక్షలు రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇక డైరెక్టర్ కొరటాల శివ రూ. 30 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకున్నాడని ఇన్ సైడ్ టాక్ నడుస్తోంది.