యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా `దేవర` మూవీతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ హై-ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ కు కొరటాల శివ దర్శకుడు కాగా.. జాన్వీ కపూర్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. సైఫ్ అలీ ఖాన్, ప్రకాశ్ రాజ్, మురళీ శర్మ, శ్రీకాంత్, అజయ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఎన్నో అంచనాల నడుమ సెప్టెంబర్ 27న థియేటర్స్ లోకి దూకిన దేవర.. ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రివ్యూలను సొంతం చేసుకుంది.
అయితే కలెక్షన్ల పరంగా మాత్రం టాక్ తో సంబంధం లేకుండా దేవర అన్ని ఏరియాల్లోనూ దండయాత్ర చేస్తోంది. తొలి రోజు అదిరిపోయే రేంజ్ లో ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ చిత్రం.. రెండో రోజు కూడా ఎక్స్లెంట్ హోల్డ్ ను కనబరిచింది. డే 2 తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.92 కోట్ల రేంజ్ లో షేర్ ని, రూ. 26 కోట్లకు పైగా గ్రాస్ ను వసూల్ చేసింది.
దేవర 2 డేస్ టోటల్ కలెక్షన్స్ ను పరిశీలిస్తే.. ఏపీ మరియు తెలంగాణలో రూ. 79.57 కోట్ల షేర్, రూ. 108.40 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. ఒక్క నైజాం ఏరియాలోనే రెండు రోజుల్లో రూ. 30.79 కోట్ల షేర్ వచ్చింది. అలాగే సీడెడ్ లో రూ. 14.07 కోట్లు, ఉత్తరాంద్రలో రూ. 8.41 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 5.66 కోట్లు, పశ్చిమలో రూ. 4.75 కోట్లు, గుంటూరులో రూ. 8.20 కోట్లు, కృష్ణలో రూ. 4.49 కోట్లు మరియు నెల్లూరులో రూ. 3.20 కోట్ల కలెక్షన్స్ ను దేవర సొంతం చేసుకుంది.
అలాగే కర్ణాటక లో రూ. 9.10 కోట్లు, తమిళనాడులో రూ. 1.85 కోట్లు, కేరళ లో రూ. 40 లక్షలు, హిందీ మరియు రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.00 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 27 కోట్ల షేర్ ను రెండు రోజుల్లో ఎన్టీఆర్ వసూల్ చేశాడు. ఇక దేవర బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 184 కోట్లు కాగా.. 2 డేస్ రన్ కంప్లీట్ అయ్యే టైమ్ కు వరల్డ్ వైడ్ గా రూ. 127.62 కోట్ల షేర్, రూ. 211 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. టార్గెట్ లో ఆల్మోస్ట్ 70 శాతం రికవరీ అయిపోయింది. ఇంకా రూ. 56.38 కోట్ల రేంజ్ లో షేర్ వస్తే దేవర బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా మారుతుంది.