• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

భర్త బలవంతపు శృంగారం.. ఆ హైకోర్టు ఇలా చేసిందేంటి?

admin by admin
May 12, 2022
in Around The World, India, Top Stories
0
Crime In India
0
SHARES
197
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp
మారిన కాలానికి తగ్గట్లుగా ప్రజల ఆలోచనల్లో వస్తున్న మార్పులు.. బంధాల మధ్య మొదలైన హక్కుల పోరాటానికి నిదర్శనంగా కొత్త తరహా కేసులు తెర మీదకు వస్తున్నాయి. ఆ కోవలోకే వస్తుంది భార్య అంగీకారం లేకుండా బలవంతంగా శృంగారం చేయటమనే అంశం. గతంలో దీన్ని ఒక తప్పుగా చూసేవారు కాదు. గడిచిన కొంతకాలంగా దీన్ని తప్పుగా చూడటమే కాదు.. భార్య హక్కులకు వాటిల్లే భంగంగా దీన్ని పరిగణించటమేకాదు.. పలువురు ఈ వాదనకు మద్దతు ఇస్తున్న పరిస్థితి.

ఇలాంటి వేళ.. భార్యకు ఇష్టం లేకుండా భర్త శృంగారం చేస్తే.. దాన్ని అత్యాచార నేరంగా పరిగణించాలని కోరుతూ వివిధ న్యాయస్థానాల్లో కేసులు నమోదువుతున్నాయి. దీనికి సంబంధించిన ఒక కేసు విషయంలో ఢిల్లీ హైకోర్టు ఏం తీర్పు చెబుతుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. అనూహ్యంగా ఈ కేసుకు సంబంధించిన ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

ఎందుకంటే.. ఈ కేసులకు సంబంధించిన వాదనలు విన్న న్యాయమూర్తులు భిన్నమైన తీర్పులు రాయటమే దీనికి కారణం. వైవాహిక అత్యాచారం తప్పే అని ఒక న్యాయమూర్తి రాస్తే.. మరొకరు ఇష్టం లేని శృంగారాన్ని అత్యాచారంగా పరిగణించటం సరికాదని పేర్కొనటంతో.. ఈ ఇష్యూను ఢిల్లీ హైకోర్టు తేల్చలేని పరిస్థితికి తీసుకొచ్చింది.

ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో.. ఈ కేసులు పెట్టుకున్న వారికి ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు అనుమతిని ఇచ్చారు. వైవాహిక అత్యాచారానికి సంబంధించి వినిపిస్తున్న వాదనలు బలంగా ఉన్నాయి. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలన్న వాదనల్లో బలమైన అభిప్రాయాలు ఉన్నట్లే.. అందుకు భిన్నంగా ఇలాంటివి నేరంగా పరిగణిస్తే.. భర్తలను వేధించేందుకు భార్యలకు ఇదో సులువైన సాధనంగా మారుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అంతేకాదు.. మన వివాహ వ్యవస్థ అస్థిరతకు గురవుతుందన్న వాదనను వినిపిస్తోంది. అదే సమయంలో.. ఈ వాదనకు బలం చేకూరే అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. ఉదాహరణకు ఐపీసీ సెక్షన్ 375 ప్రకారం చూస్తే.. మైనర్ కాని భార్యతో భర్త లైంగిక చర్యల్లో పాల్గొనటం నేరం కాదు. అయితే.. ఈ సెక్షన్ సరికాదన్నది పలువురి వాదన. ఎందుకంటే.. భార్యకు ఇష్టం లేకున్నా బలవంతంగా కాపురం చేసే వైనం మహిళల హక్కులు హరించడం గా ఉంది కదా? అని వాదిస్తున్నారు.

వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలని కోరుతూ ఆర్ ఐటీ.. ఆల్ ఇండియా డెమొక్రాటిక్ ఉమెన్స్ ఫౌండేషన్లు పిటిషన్లు జారీ చేశాయి. అయితే.. వైవాహిక అత్యాచారాన్ని నేరంగా పరిగణించాలనే వాదనల్ని కేంద్రం వ్యతిరేకించింది. ఈ అంశంపై ప్రాశ్చాత్య దేశాల్లో అమలవుతున్న విధానాల్ని గుడ్డిగా ఫాలో కాలేమని కేంద్రం స్పష్టం చేస్తోంది. మారిటల్ రేప్ సంబంధించి దాఖలైన పిటిషన్లపై ఢిల్లీ హైకోర్టు ఈ ఏడాది మొదట్లో (జనవరిలో) రోజువారీ వాదనల్ని జరిపింది.

ఫిబ్రవరి 21 నాటికి విచారణ ముగిసి.. తీర్పు రిజర్వ్ చేశారు. ట్రిఫుల్ తలాక్ రద్దు మాదిరే మారిటల్ రేప్ విషయంలోనూ ముస్లిం మహిళల్ని లక్ష్యంగా చేసే అంశాలు ఉన్నట్లుగా వాదనలు వినిపించాయి. గతంలో మారిటల్ రేప్ ను నేరంగా పరిగణలోకి తీసుకోలేమన్న కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ఢిల్లీ హైకోర్టు నోటీసుల నేపథ్యంలో తమ ప్రకటనను పునర్ పరిశీలిస్తామని చేసిన ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు వైవాహిక అత్యాచారం నేరం కాదని సుప్రీంకోర్టు కొన్ని కేసుల్లో తీర్పును ఇచ్చింది. తాజాగా ఢిల్లీ హైకోర్టు ఇదే అంశానికి సంబంధించిన ద్విసభ్య ధర్మాసనంలోని జస్టిస్ రాజీవ్ షక్దేహర్ తన తీర్పులో వైవాహిక జీవితంలో భార్యతో బలవంతపు శృంగారం కచ్ఛితంగా నేరమేనని తీర్పు ఇచ్చారు. దీనికి భిన్నంగా జస్టిస్ సి. హరిశంకర్ మాత్రం.. వైవాహిక అత్యాచారాన్ని ఆయన సమర్థించలేదు.

దీంతో..మారిటల్ రేప్ అంశంపై ఇరువురు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయటంతో.. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తూ అంగీకారాన్ని తెలిపారు. మరి.. దీనిపై సుప్రీంకోర్టు ఏమంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Tags: confused verdictDelhi High courtmarital rape in indiamixed verdictshocking comments
Previous Post

బే ఏరియాలో సర్కారు వారి పాట మేనియా

Next Post

నాని స్పీక్స్ : అంతా అనుకుల‌మేనా స‌ర్ ! ఎనీ డౌట్స్ !

Related Posts

Top Stories

ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్

June 5, 2023
Top Stories

వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్

June 5, 2023
Trending

టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్

June 5, 2023
Top Stories

మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!

June 4, 2023
బద్వేలు అసెంబ్లీ ఉప ఎన్నిక అంశంపై జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో చర్చిస్తున్న జనసేన అధ్యక్షులు శ్రీ 
@PawanKalyan
 గారు, పార్టీ పిఏసీ ఛైర్మన్ శ్రీ 
@mnadendla
 గారు, బిజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ 
@somuveerraju
 గారు, బిజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ 
@BJPMadhukarAP
 గారు.
Trending

టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ

June 4, 2023
Top Stories

ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ

June 4, 2023
Load More
Next Post

నాని స్పీక్స్ : అంతా అనుకుల‌మేనా స‌ర్ ! ఎనీ డౌట్స్ !

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఆనంపై దాడి…జగన్ కు లోకేష్ డెడ్లీ వార్నింగ్
  • వైసీపీ మూకలను తరిమికొట్టిన ఆనం రమణారెడ్డి…వైరల్
  • టీడీపీ, బీజేపీల పొత్తుపై తేల్చేసిన బండి సంజయ్
  • టీడీపీ ఎమ్మెల్యే డోలా అరెస్ట్..కొండపిలో హై టెన్షన్
  • జగన్ అప్పులపై ఆనం సంచలన వ్యాఖ్యలు
  • మ‌నోడే అయినా.. విమ‌ర్శిస్తే లాగేయ‌డ‌మే: వైసీపీ ఇంతే గురూ!
  • టీడీపీతో పొత్తుపై నాదెండ్ల క్లారిటీ
  • ఆ స్థానంలో పవన్ 60 వేల మెజారిటీతో గెలుస్తారంటోన్న రఘురామ
  • జగన్ పాము వంటి వాడు… లోకేష్ ఫైర్
  • చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?
  • ఒడిశా రైలు ప్రమాదంపై రాహుల్ రామకృష్ణ వివాదాస్పద వీడియో
  • పరదాల విషయంలో జగన్ బాటలోనే కేసీఆర్!
  • జగన్ పై జాతీయ మానవ హక్కుల సంఘం సీరియస్
  • ఏపీలో ముందస్తు ఎన్నికలపై సీఈసీ కీలక ప్రకటన
  • రాష్ట్రం విడిపోయి 9 ఏళ్లు.. చెప్పేందుకు ఏముంది …!

Most Read

శక పురుషునికి ‘ట్రై వ్యాలీ ఎన్టీఆర్ అభిమానులు’ శత జయంతి నీరాజనం!

తమన్నా మ్యాటర్ లీక్ చేసేసిన చిరు

NTR-శక పురుషునికి ‘టైమ్ స్క్వేర్’ శత జయంతి నీరాజనం!

శాన్ ఫ్రాన్సిస్కో లో ‘రాహుల్ గాంధీ’కి ఘన స్వాగతం!

మేరీల్యాండ్ లో ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు!

చంద్రబాబు కు అమిత్ షా అభయ హస్తం?

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra