నటసింహం నందమూరి బాలకృష్ణ రీసెంట్ బ్లాక్ బస్టర్ `డాకు మహారాజ్` ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. బాబీ కొల్లి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామా భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. నందమూరి అభిమానుల నుంచే కాకుండా సామాన్య ప్రేక్షకుల కూడా పాజిటిక్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవ్వబోతోంది.
ప్రముఖ దిగ్గజ ఓటీటీ ఫ్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ వారమే డాకు మహారాజ్ స్ట్రీమింగ్ కాబోతోంది. ఫిబ్రవరి 21 నుంచి బాలయ్య నటించిన డాకు మహారాజ్ ను తమ ఫ్లాట్ఫామ్ లో వీక్షించవచ్చు అంటూ నెట్ఫ్లిక్స్ తాజాగా అధికారిక ప్రకటన చేసింది. ఇకపోతే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్లపై నిర్మితమైన డాకు మహారాజ్ చిత్రంలో బాలయ్యకు జోడిగా ప్రగ్యా జైస్వాల్ నటించింది.
ప్రతినాయకుడి పాత్రను బాబీ డియోల్ పోషించగా..శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా, సచిన్ ఖేడేకర్, చాందిని చౌదరి, వేద అగర్వాల్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం అందించాడు. రొటీన్ స్టోరీనే అయినా దాన్ని కొత్తగా ప్రజెంట్ చేయడంలో డైరెక్ట్ బాబీ సక్సెస్ అయ్యాడు. బాలయ్య నటన, యాక్షన్ పార్ట్, కథలోని మాస్ అంశాలు, తమన్ సంగీతం, సెకండాఫ్ సినిమాకు ప్రాణం పోశాయి. సంక్రాంతి సీజన్ కూడా కలిసి రావడంతో డాకు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. కాగా, బాలయ్య ప్రస్తుతం `అఖండ 2` మూవీతో బిజీగా ఉన్నారు.