నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో రూపుదిద్దుకున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ `డాకు మహారాజ్` ఈ సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సిద్ధమైంది. జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. ఇటీవల బయటకు వచ్చిన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు తారా స్థాయిలో ఏర్పడ్డాయి. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సూపర్ హిట్స్ ను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్లో ఉన్న బాలయ్య.. డాకు మహారాజ్ తో మరోసారి బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేయాలని భావిస్తున్నారు.
ఇకపోతే తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్కలు బయటకు వచ్చాయి. అన్ని ప్రధాన ఏరియాల్లో డాకు మహారాజ్ చిత్రానికి బాలయ్య కెరీర్లోనే హయ్యెస్ట్ బిజినెస్ జరిగింది. ఏపీ మరియు తెలంగాణలో రూ. 67.30 కోట్ల రేంజ్ లో బిజినెస్ అయితే.. వరల్డ్ వైడ్ గా రూ. 80.70 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఏరియాల వారీగా చూసుకుంటే.. నైజాంలో రూ. 17.50 కోట్లు, సీడెడ్ లో రూ. 15.50 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 8 కోట్లు, తూర్పు గోదావరిలో రూ. 6 కోట్లు, పశ్చిమలో రూ. 5 కోట్లు, గుంటూరులో రూ. 7.2 కోట్లు, కృష్ణలో రూ. 5.4 కోట్లు మరియు నెల్లూరులో రూ. 2.7 కోట్లకు డాకు మహారాజ్ థియేటర్స్ రైట్స్ అమ్ముడయ్యాయి.
ఓవర్సీస్ లో రూ. 8 కోట్ల రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. పొంగల్ పోరులో దిగుతున్న డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలవాలంటే బాలయ్య ఎదుట ఉన్న టార్గెట్ రూ. 82 కోట్లు. మరి ఈ భారీ టార్గెట్ ను అందుకుని బాలయ్య తన సక్సెస్ జోరును కంటిన్యూ చేస్తారా? లేదా? అన్నది చూడాలి. కాగా, డాకు మహారాజ్ చిత్రానికి గీతా ఆర్ట్స్ పంపిణీ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, చాందిని చౌదరి, ఊర్వశి రౌతేలా, సచిన్ ఖేడేకర్ తదితరులు ముఖ్యమైన పాత్రలను పోషించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సినిమాను నిర్మించగా.. థమన్ మ్యూజిక్ అందించాడు.