నటసింహం నందమూరి బాలకృష్ణ ఖాతాలో మరో హిట్ ఖాయమైంది. బాబీ కొల్లి దర్శకత్వంలో బాలయ్య నటించిన తాజా చిత్రం `డాకు మహారాజ్` జనవరి 12న విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. టాక్ అనుకూలంగా రావడానికి తోడు సంక్రాంతి సీజన్ కావడంతో కలెక్షన్స్ పరంగా బాలయ్య బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. ఇప్పటికే 100 కోట్ల క్లబ్ లో చేరిన డాకు.. ఎక్సలెంట్ హోల్డ్ తో వీరవిహారం చేస్తోంది.
తాజాగా డాకు మహారాజ్ ఆరు రోజుల కలెక్షన్స్ లెక్క బయటకు వచ్చింది. ఏపీ మరియు తెలంగాణలో 6 డేస్‌లోనే డాకు చిత్రానికి రూ. 59.44 కోట్ల షేర్, రూ. 90.95 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే ఓవర్సీస్ లో కూడా బాలయ్య లేటెస్ట్ మూవీకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అక్కడ ఆరు రోజుల్లో డాకు రూ. 7.35 కోట్ల షేర్ ను కొల్లగొట్టింది. ఇక వరల్డ్ వైడ్ గా 6 డేస్ రన్ ముగిసే సమయానికి రూ. 70.39 కోట్ల షేర్, రూ. 114.40 కోట్ల గ్రాస్ ను డాకు సొంతం చేసుకుంది.
ఈ సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 82 కోట్లు. ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ కాకుండా ఇంకా రూ. 11.61 కోట్ల షేర్ వస్తే డాకు మహారాజ్ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలుస్తుంది. అయితే ఫుల్ రన్ లో బాలయ్యకు ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా, డాకు మహారాజ్ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు. ఇందులో ప్రగ్యా జైస్వాల్, శ్రద్దా శ్రీనాథ్, బాబీ డియోల్ తదితరులు కీలక పాత్రలను పోషించగా.. థమన్ మ్యూజిక్ అందించాడు.