టాలీవుడ్ : తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ఒక అసిస్టెంట్ డైరెక్టర్ మరియు అతని సహాయకుడిని సైబరాబాద్ పోలీసులు ఒక సెక్స్ రాకెట్లో అరెస్ట్ చేశారు. ఈ వ్యవహారంలో నలుగురు యువతులు ఉన్నారు. వారికి పోలీసులు విముక్తి కల్పించారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న సురేష్ బోయిన అలియాస్ కుమార్ సెట్టి అలియాస్ కరణ్ అలియాస్ సురేష్ సిద్దార్థ్ (32), మేకల అఖిల్ కుమార్ అలియాస్ అఖిల్ అశ్విన్ అలియాస్ జేమ్స్ (37) లను anti human traffiking department అధికారులు అక్రమ రవాణా నిరోధక విభాగం (ఏహెచ్‌టియు) అదుపులోకి తీసుకున్నారు.
సైబరాబాద్ పోలీసులు ఈ వ్యవహారాన్ని లోతుగా అధ్యయనం చేసి సెక్స్ ట్రేడ్‌కు దోహదపడుతున్న నాలుగు వెబ్సైట్లను తొలగించినట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. ముందు గోవాలో సెక్స్ రాకెట్ నడుపుతున్న సురేష్ దాదాపు 500 మంది మహిళలను ప్రీమియం కస్టమర్ల కోసం ఈ వ్యాపారంలోకి తీసుకొచ్చాడు. తర్వాత అతను తన మకాం హైదరాబాద్ మార్చాడు.
అతనిపై 35 మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. అతని ను పశ్చిమ బెంగాల్, ముంబై, ఢిల్లీ, బెంగళూరు మొదలైన ప్రాంతాల నుండి 500 యువతులను ఈ వ్యాపారంలోకి దింపాడు. ఇతను ఈ వ్యాపారాన్ని డిజిటల్ గా నడుపుతున్నారు.
ప్రత్యేక వెబ్సైట్లలో ప్రకటనలు పోస్ట్ చేసి కాల్ సెంటర్లు మరియు వాట్సాప్ ద్వారా కస్టమర్లను సంప్రదించేవారు. నగరంలోని వివిధ హోటళ్లలో వ్యభిచారం జరుగుతుందని పోలీసులు తెలిపారు.