హాట్ బ్యూటీ సన్నీ లియోనీ మోసపోయింది. ఆన్లైన్ కేటుగాళ్లు ఆమెను బురిడీ కొట్టించారు. ఆమె పాన్ కార్డు ఉపయోగించి, ఆన్లైన్లో లోన్ తీసుకున్నారు. ఈ విషయం ఆమె ట్వీట్ చేయడం వల్ల వెలుగులోకి వచ్చిం ది.
ఈ విషయమై ఆమె బ్యాంక్ అధికారులను సంప్రదించగా, వారు సన్నీని మోసం చేసిన వ్యక్తులను గుర్తించి, సమస్యను పరిష్కరించారు. అనంతరం సన్నీ బ్యాంక్ సిబ్బందికి కృతజ్ఞతలు చెబుతూ ట్వీట్ చేసింది.
ఆన్లైన్ నగదు లావాదేవీల్లో మోసలు గతకొంతకాలంగా ఎక్కువైపోయాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు అందరూ దీని బారిన పడుతున్నారు. ఇప్పుడు సన్నీ లియోనీ కూడా ఈ విధంగానే మోసపోయింది.
గుర్తు తెలియని వ్యక్తులు ఆమె పాన్ కార్డు ఉపయోగించి, ధని యాప్ నుంచి రూ.2 వేల రుణం తీసుకున్నారు. ఆ మొత్తం తిరిగి చెల్లించకపోవడం వల్ల సన్నీ సిబిల్ స్కోరు తగ్గిపోయింది.
ఏం జరిగిందో తెలియని సన్నీ, బ్యాంక్ అధికారులను సంప్రదించగా అసలు విషయం బయటపడింది. ఈ సందర్భంగా మాట్లాడిన సన్నీ లియోనీ.. అందరూ అప్రమత్తంగా ఉండాలని, లేకపోతే మోసగాళ్ల బారినపడే అవకాశం ఉందని హెచ్చరించింది.
అయితే.. ప్రస్తుతం సన్నికి జరిగిన ఘోర ఘటనపై ఇటు సిని వర్గాల్లో నూ .. ఆర్థిక రంగంలోనూ.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి దీనిపై ఆమె ఫిర్యాదు చేస్తే.. ఏం జరుగు తుందో చూడాలి. మొత్తానికి.. ఈ విషయంపై బ్యాంకు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.. చూడాలి.