వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌లో గెలుపొందిన విజేతకు అందించే ట్రోఫీ.. గురించిన ఆసక్తి అందరికీ ఉంటుంది. గెలుపు గుర్రం ఎక్కిన విజేతకు స్టేడియంలోనే ఈ ట్రోఫీని అందిస్తారు. చుట్టూ మూడు వంకీల మధ్య ఒక గ్లోబు నిలబడిన ఆకారంలో రూపొందించిన ఈ ట్రోఫీలో ఏయే పదార్థాలు వినియోగిస్తారనేది అత్యంత ఆసక్తి. అసలు ఈ ట్రోఫీని ఎక్కడెక్కడ తయారు చేస్తారనేది కూడా ఆసక్తే. ఆ విశేషాలు ఇవీ..
+ ట్రోఫీని డిజైన్ చేసేందుకు ప్రపంచ దేశాల క్రికెట్ సంఘాలు ఏడాది ముందు నుంచి కసరత్తు చేస్తాయి. అందరికీ ఆమోద యోగ్యమైన డిజైన్‌కు పచ్చజెండా ఊపుతాయి.
+ అనంతరం దీని తయారీ బాధ్యతలను ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలోని అంతర్జాతీయ నిపుణుల కమిటీకి అప్పగిస్తారు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క భాగాన్ని రూపొందిస్తారు.
+ ఈ ట్రోఫీకి అరకిలో బంగారం వినియోగిస్తారు. పైన కనిపించే గ్లోబుకు దీనిని దట్టమైన పూతగా వేస్తారు.
+ ఇక, పది కిలోల వెండితో కింద ఉండే మడమ భాగాన్ని రూపొందిస్తారు. అదేవిధంగా ట్రోఫీ చుట్టూ ఉండే మూడు వంకీలను కూడా వెండితోనే రూపొందిస్తారు.
+ ఇక, ప్లాటినమ్‌ను కూడా ఈ కప్పు తయారీలో వాడతారు.
+ ఈ కప్పు తయారీకి సుమారు 30 నుంచి 40 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది.
+ ఈ మొత్తాన్ని టోర్నీలో పాల్గొనే అన్ని దేశాల క్రికెట్ సంఘాలు భరిస్తాయి.