వైఎస్ కుటుంబం బతికేదే రైతుల కోసం అని బిల్డప్ ఇచ్చే ఆ కుటుంబం రైతులకు చెప్పే మాటలన్నీ బూటకమని అని తాజా నివేదిక ఒకటి ఖరారుచేసింది.
రైతుల ఆత్మహత్యల్లో జగన్ సర్కారు ఆధ్వరంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మూడో స్థానానికి ఎగబాకింది. ‘క్రైమ్ ఇన్ ఇండియా 2021 నివేదిక’లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదించిన అధికారిక గణాంకాల ద్వారా ఈ విషయం వెలుగు చూసింది.
దేశంలో 10,881 మంది రైతులు మరియు వ్యవసాయ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోగా, వారిలో 1,065 (9.78%) ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారు. ఇవి కేవలం అధికారికం మాత్రమే. లెక్కకు రానివి ఇంకెన్నో ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో సగటున ఒక్కరోజులో ముగ్గురు రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారంట. మరి ఇది జగన్ పేపరు సాక్షిలో వేయరు గాక వేయరు రేపు.
ఆత్మహత్యలు చేసుకున్న రైతుల్లో ఎక్కువ మందికి సొంత భూములు ఉన్నాయి. అంటే రైతుల విషయం జగన్ తీసుకుంటున్న చర్యలు శూన్యం అని చెప్పవచ్చు.
జగన్ రికార్డు ఇదొక్కటే కాదు. ఇంకోటి ఉందండోయ్. ఇతర నేరాల రేటులోను జగన్ దే రికార్డు. ఇతర నేరాల్లో ఆంధ్రప్రదేశ్ భారతదేశంలో 10వ స్థానంలో ఉంది. మహిళలపై నేరాల విషయంలోనూ రాష్ట్రం 10వ స్థానంలో నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న దిశా చట్టం ఏమైంది మరి?
అంతేకాదు రాష్ట్రంలో చిన్నారులపై నేరాలు, హత్యల కేసులు కూడా గత ప్రభుత్వం కంటే ఇపుడు పెరిగాయి. రాష్ట్రంలో నేరాలకు పాల్పడే యువకుల సంఖ్య కూడా స్వల్పంగా పెరిగింది. వీరంతా ఎవరి అండతో రెచ్చిపోతున్నారో కూడా అందరికీ అర్థమయ్యే ఉంటుంది కదా.
రాష్ట్ర ప్రభుత్వం నమోదు చేసిన అంకెల్లోనే జగన్ ఇన్ని రికార్డులు సృష్టిస్తే… ఇక లెక్కకురాని అరాచకాలు ఏపీలో ఇంకెన్నో మరి.
Comments 1