దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న కరోనా మహమ్మారి రెండో విడత దెబ్బకు ఇప్పుడెలాంటి పరిస్థితి ఉందో తెలిసిందే. కరోనా గురించి అవగాహన లేని వేళలో.. కొందరు చేసిన వ్యాఖ్యలకు సంబందించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
ఎప్పుడైతే కరోనా సెకండ్ వేవ్ తో తెలంగాణ ఆగమాగం కావటం షురూ అయ్యిందో.. ఒక పాత వీడియో సోషల్ మీడియాలో.. వాట్సాప్ గ్రూపుల్లో తెగ వైరల్ అవుతోంది. వేలాది పుస్తకాలు చదివినట్లుగా తన గురించి తాను గొప్పలు చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. మేధావి అన్న ట్యాగ్ ఉన్న విషయం తెలిసిందే.
అలాంటి ఆయన కరోనా గురించి పెద్దగా అవగాహన లేని వేళలో.. దాని గురించి నిండు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు.. కోసిన కోతలు.. పలికిన బడాయి మాటలు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.
కరోనా తీవ్రతకు వెయ్యి కోట్లతో చెక్ పెడతానని చెప్పిన పెద్ద మనిషి.. ఈ రోజున బెడ్లు దొరక్క.. ఆసుపత్రుల్లో ఆడ్మిషన్లు లభించక ప్రాణాలు పోతున్న పరిస్థితి. మరి.. ఇప్పటికైనా వెయ్యి కోట్ల ఏమయ్యాయి? అన్నది క్వశ్చన్.
అంతేనా.. కరోనా కానీ వస్తే.. ముఖానికి మాస్కులు లేకుండా తనతో సహా.. తమ పార్టీ ఎమ్మెల్యేలంతా కథానాయకుల మాదిరి కదనరంగంలో దిగుతారని.. పని చేస్తారని చెప్పిన వైనాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడేమో.. ఒక్క ఎమ్మెల్యే కూడా అత్తా పత్తా లేని పరిస్థితి.
ఒక్క ఎమ్మెల్యే మాత్రమే కాదు.. ప్రజాప్రతినిధులుగా ఉన్న ఏ ఒక్కరు కనిపించని పరిస్థితి. దవాఖానాల దగ్గరో.. కోవిడ్ టెస్టింగ్ కేంద్రాల వద్దనో.. వ్యాక్సిన్ కొరతను అధిగమించేందుకు వీలుగానో ప్రయత్నించాల్సిన వారెవరూ.. కనిపించని పరిస్థితి.
కరోనా పుణ్యమా అని పరిస్థితి దారుణంగా తయారైన వేళ.. దాని టెన్షన్ నుంచి రిలీఫ్ పొందటానికి కేసీఆర్ మాట్లాడిన మాటల వీడియో ఇప్పుడు పనికి వస్తుందని చెప్పక తప్పదు. విషాదంలో వినోదం అన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా తాజా వీడియో నిలుస్తుందని చెప్పక తప్పదు.
అప్పట్లో కోవిడ్ తో కేసీఆర్ పరాచకాలు pic.twitter.com/rfKdqdss56
— Political Missile (@TeluguChegu) April 17, 2021