ఊరందరిదీ ఒకదారి అయితే ఉలిపిరికట్టది ఒకదారి అనే సామెత జగన్ కి సరిపోతుంది. నువ్వు లక్ష చెప్పు నేను మాస్క్ పెట్టుకోను అన్నట్టు ఎపుడూ మాస్కు లేకుండా కనిపిస్తాడు.
తాను మాస్క్ పెట్టుకోవడమే కాకుండా తన పార్టీ నేతలు ఎవరైనా తన వద్దకు వచ్చినపుడు మాస్కు పెట్టుకుని ఫొటో దిగుతావా అని గద్దిస్తారు జగన్. ఆయనిలా మాట్లాడే వీడియోలు కూడా బయటకు వచ్చాయి.
కానీ మోడీ అమిత్ షాలను కలిసినపుడు కూడా మాస్కు పెట్టకుండా ఉండే ధైర్యం ఉందా జగన్ అంటే సైలెంటవుతాడు.
ధైర్యవంతుడు ఎక్కడైనా ధైర్యంగా ఉండాలిగా… మోడీ అమిత్ షాలు అంటే భయం కాబట్టి అక్కడ మాస్క్ పెట్టుకుంటారు మన ముఖ్యమంత్రి. మిగతా ఎక్కడైనా తాను మాస్క్ పెట్టుకోరు.
తాను మాత్రం చట్టం అతిక్రమిస్తారు…. జనాలు మాత్రం మాస్క్ పెట్టుకోకుంటే ఫైన్ వేస్తారు.
తాజాగా కరోనా దేశంలోనే 2వ స్థానంలో ఏపీని నిలబెట్టిన జగన్ తీరు మారలేదు. తిరుపతిలో గెలిచిన గురుమూర్తితో పాటు పలువురు జగన్ ని కలవడానికి వస్తే జగన్ మాస్క్ వాడలేదు. వారినీ వాడనివ్వలేదు.
#NOMASKJAGAN
#JAGANWITHOUTMASK
#COVIDIOTSOFAP
అని కొన్ని సార్లు జగన్ మాస్కులేని ఫొటోలు ట్రెండ్ అయ్యాయి. అయినా జగన్ మారలేదు. మాస్కు పెట్టలేదు.
మరి సభ్య సమాజానికి జగన్ ఏం మెసేజ్ ఇస్తున్నట్టో మరి.
మోడీ అమిత్ షా లను కలిస్తే మాత్రం తప్పకుండా మాస్క్ పెడతాడు జగన్. ఫొటోల చూడొచ్చు. అంటే తనకంటే బలవంతులు వద్ద మాత్రమే జగన్ వినయంగా ఉంటాడు.