తమది ప్రజా ప్రభుత్వమని పదే పదే డబ్బా కొట్టుకునే ఘనత వహించిన జగనన్న పాలనలో రోగులు నరక యాతన పడుతున్నారు.
ముఖ్యంగా కరోనా వైరస్ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్న నేపథ్యం లో ప్రజలు అల్లాడిపోతున్నారు. అయితే.. తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని.. ప్రజారోగ్యానికి ప్రాధా న్యం ఇస్తున్నామని సీఎం జగన్, సహా మంత్రులు చెబుతున్నారు.
కోట్ల రూపాయలను వైద్య రంగానికి కేటా యిస్తున్నామని భారీ ఎత్తున ప్రకటనలు కూడా గుప్పిస్తున్నారు.
అయితే.. గుంటూరులో జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యంత దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలోనే పేరున్న ఈ ఆసుపత్రిలో కోవిడ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కరోనా రోగులకు ఇక్కడ చికిత్స అందిస్తున్నారు.
మౌలిక సదుపాయాలు అత్యంత దారుణంగా ఉండడం తీవ్ర కలకలంగా మారింది. కోవిడ్ రోగులకు కేటాయించిన వార్డులు.. మురికి కూపాలుగా.. చెత్తకుండీలుగా దర్శనమిస్తున్నాయి.
ఏ మాత్రం శుభ్రతలేదు. దోమలు, ఈగలు సహా.. వాడి పడేసిన సిలైన్‌బాటిళ్లు, వాటర్ బాటిళ్లు కూడా కొవిడ్ వార్డులుగా ఉన్న 333, 332లో దర్శన మిస్తున్నాయి.
మరుగు దొడ్ల పరిస్థితి మరింత దుర్భంగా ఉంది. వీటిని శుభ్రం చేసేవారు కూడా ఎవరూ కనిపించడం లేదు. నర్సులు వైద్య సిబ్బంది మాత్రం దీనిని కొవిడ్ వార్డులుగా చెబుతూ.. వచ్చిన వారికి ఈ వార్డులనే కేటాయిస్తున్నారు.
ఇలా వచ్చిన ఓ వ్యక్తి.. ఇక్కడి పరిస్థితులను వీడియోలో చిత్రీకరించి.. ఏకంగా ముఖ్యమంత్రి జగన్ కు వివరించారు.
ట్వట్టర్‌లో గుంటూరు ఆసుపత్రిలో నెలకొన్న పరిస్థితులను వివరిస్తూ.. తాను రెండు రోజులుగా వార్డు 333 లో ఉన్నానని.. ఇక్కడ ఏమాత్రం పరిశుభ్రత లేదని.. పైగా ఇదే కొవిడ్ వార్డు అని .. నర్సులు చెబుతు న్నట్టు తెలిపారు.
అంతేకాదు.. వార్డు 332లో గత రాత్రి నుంచివిద్యుత్ సౌకర్యంకూడా లేదని పేర్కొన్నారు. ఇప్పటికైనా దయచేసి ముఖ్యమంత్రిస్పంచాలని ఆయన అభ్యర్థించారు. ప్రస్తుతం ఈ వీడియోలు వైరల్ అవుతుండడం గమనార్హం.
ఇది వాస్తవం :
@AndhraPradeshCM sir this is the situation in Government General Hospital guntur since 2 days in ward no 333 .There is no proper cleaning in the ward as it is said as covid ward by the nurses and there is also no power from last nite in Ward no 332. So please kindly look at this pic.twitter.com/L2SIIuDdEi
— M.Sarath Chandra (@sarath_uoh) April 22, 2021
ఇది పచ్చి అబద్ధం :
ఆరోగ్యంగా గుండ్రాయిలా ఉన్నా ఈ డ్రామాలేంటి అచ్చన్నా? కార్పొరేట్ ఆస్పత్రే కావాలా? ఏం ఈఎస్ఐ ఆస్పత్రి వద్దా? మీ CBN హయాంలా కాదు జగన్ గారి ప్రభుత్వం. ఆస్పత్రులకు అన్ని హంగులు అద్దింది. సమస్య వస్తే చూసుకుంటుంది.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 7, 2020
అనంతపురం జిల్లాలో 1500 పడకల కరోనా ఆసుపత్రిని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గూగూల్ లో వెతికి చూడండి పచ్చ తమ్ముళ్లూ. ఇంకెక్కడైనా ఇంత వేగంగా, సకల సౌకర్యాలతో తాత్కాలిక హాస్పిటల్ తయారైందేమో. ఈ కష్టకాలంలో చిరునవ్వుతో భరోసా ఇచ్చే సిఎం ఉండటం రాష్ట్రం అదృష్టం.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 21, 2020
కొత్త మెడికల్ కాలేజీలు, హాస్పిటళ్లు. పది రెట్లు పెరిగిన ఐసియూ బెడ్లు, వెంటిలేటర్లు. కొత్తగా 108 అంబులెన్సులు, పబ్లిక్ హెల్త్ కేర్ రంగం సాచ్యురేషన్ స్థాయికి దూసుకెళ్తోంది. ఆరోగ్యశ్రీలో కరోనాను కూడా చేర్చారు సిఎం జగన్ గారు. విద్య, ఆరోగ్యం ఆయన ప్రాథమ్యాలలో ముందున్నాయి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 3, 2020
ప్రభుత్వ ఆస్పత్రులకు అదనపు బలం చేకూరుస్తున్న జగన్ గారి ప్రభుత్వం. ఒకే నోటిఫికేషన్ ద్వారా దాదాపు 10వేల వైద్యపోస్టుల భర్తీ. గత ప్రభుత్వాలు నియామకాలు చేపట్టకపోవడంతో ప్రభుత్వాసుపత్రులు నిర్వీర్యమయ్యాయి. ఇకపై 24 గంటలూ పూర్తి స్టాఫ్ తో పనిచేస్తాయ్.
— Vijayasai Reddy V (@VSReddy_MP) July 4, 2020
ప్రజారోగ్యం పట్ల సిఎం జగన్ గారి తపనకు కార్యరూపం జూలై 1 నుంచి ప్రత్యక్షంగా కనిపిస్తుంది. 203 కోట్లతో కొనుగోలు చేసిన అత్యాధునిక 104, 108 అంబులెన్సులు, మొబైల్ క్లినిక్ ల సేవలు మొదలవుతాయి. వెంటిలేటర్లు, ఇసిజి, ప్రాణాపాయ స్థితిలో అత్యవసర లైఫ్ సపోర్ట్ వ్యవస్థలు వీటిల్లో ఉంటాయి.
— Vijayasai Reddy V (@VSReddy_MP) June 30, 2020