ప్రపంచ దేశాలను భయపెడుతున్న కొత్త వైరస్ బ్రిటన్ లో అనూహ్యంగా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో యూకేలో 36,804 కేసులు నమోదు అయ్యాయి. అంటే బాధితుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. బ్రిటన్ నుండి తెలంగాణకు వారం రోజుల్లో 358 మంది వచ్చారని తేలింది.
బ్రిటన్ కు అన్ని దేశాలు రాకపోకలు నిలిపేశాయి. అయితే, ఇప్పటికే ఇటలీ, ఆస్ట్రేలియా, అమెరికాలకు కొత్త వైరస్ పాకింది. యూరప్ మొత్తం ప్రస్తుతం ఆంక్షల్లో ఉంది. బ్రిటన్ నుంచి మన దేశానికి వచ్చిన వారిలో ఇప్పటిదాకా 8 మందికి కరోనా పాజిటివ్.. ఢిల్లీలో అయిదుగురు, కోల్ కతాలో ఇద్దరు, చెన్నైలో ఒకరికి కరోనా పాజిటివ్.. పాజిటివ్ వచ్చిన వారిలో కొత్త కరోనా లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు పూణెకు పంపారు.
ఇదిలా ఉండగా… బ్రిటన్ ప్రధాని గణతంత్ర వేడుకలకు భారతదేశానికి విచ్చేస్తున్నారు! అయితే, ఆయనను రావొద్దని వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఇపుడు ప్రజలు కూడా ఆయన రావొద్దని కోరుకుంటున్నారు.