పోలింగ్ జరిగి ఓటమి ఖాయమని తెలిసిపోయింది కాబట్టే నిధులను బీఆర్ఎస్ ప్రభుత్వం దారి మళ్ళిస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ఆరోపించటమే కాకుండా ప్రభుత్వాన్ని నియంత్రించాలని కూడా ఎన్నికల కమీషనర్ వికాస్ రాజ్ ను కలిసి పిర్యాదుచేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే ఓటమి తప్పదని అర్ధమైపోయిన కేసీయార్ రైతుబంధు నిధులను కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు ఆరోపణలు గుప్పించారు. రైతుబంధు పథకానికి ఖర్చు చేయాల్సిన రు. 6 వేల కోట్లను కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్స్ చెల్లిస్తున్నట్లు మండిపడ్డారు.
అలాగే అసైన్డ్ భూముల రికార్డులను కూడా ధరణి పోర్టల్లో తారుమారు చేసేస్తున్నట్లు గోల చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అధికార దుర్వనియోగాన్ని అడ్డుకోవాలని వికాస్ రాజ్ ను కలిసి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదులు చేశారు. కోడ్ ఆఫ్ కాండక్ట్ అముల్లో ఉన్న కారణంగా రైతుబంధు పథకం అమలుకు కేంద్ర ఎన్నికల కమీషన్ అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఓటమి భయంతో ఆ నిధులన్నింటినీ బీఆర్ఎస్ కు సన్నిహితంగా ఉండే కాంట్రాక్టర్లు చేసిన పనుల తాలూకు బిల్లును కేసీయార్ చెల్లిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.
కేసీయార్ ప్రభుత్వం చేస్తున్న అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవాలని ఎన్నికల కమీషన్ను కాంగ్రెస్ నేతలు రిక్వెస్టుచేశారు. అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని వేలాది ఎకరాల అసైన్డ్ భూములను కేసీయార్ కుటుంబసభ్యులతో పాటు సన్నిహితల పేర్లమీదకు మార్చుకుంటున్నట్లు ఆరోపించారు. కాంగ్రెస్ నేతల ఆరోపణలను పక్కనపెట్టేస్తే పై రెండు ఆరోపణలు నిజమే అయితే కేసీయార్ అడ్డంగా దొరికిపోవటం ఖాయం.
ఎలాగంటే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వటం అన్నది ఆన్ లైన్ ఆధారంగానే జరగుతుంది. ఆన్ లైన్లో బిల్లులు క్లియర్ చేస్తే మొత్తం రికార్డయిపోతుంది. అలాగే అసైన్డ్ భూములను కేసీయార్ మనుషుల పేర్లతో మార్చుకోవటం కూడా సాధ్యంకాదు. ఒకవేళ మార్చుకుంటే అది కూడా ఆన్ లైన్లో బయటపడుతుంది. కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వటం తప్పేమీకాదు. రైతుబంధు పథకం డబ్బులను కాంట్రాక్టర్లకు చెల్లించటం అన్నది పూర్తిగా కేసీయార్ విచక్షణ. ఎందుకంటే ఫలితాలు వచ్చేసి బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఆ పనిచేస్తే అది తప్పవుతుంది. కానీ ఫలితాలు రాకముందే బిల్లులు చెల్లిస్తే అధికార దుర్వినియోగం ఎలాగవుతుంది ?