సీఎం జగన్ ఇంట విషాదం.. భారతి తండ్రి మృతి

Andhra Oct 03, 2020

ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంట విషాదం నెలకొంది. జగన్ మామ కమ్ ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి అనారోగ్యంతో మరణించారు. కొంతకాలంగా ఆయన ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. శుక్రవారం అర్థరాత్రి ఆయన మరణించినట్లుగా వైద్యులు ప్రకటించారు.

వైఎస్ జగన్ సతీమణి భారతి తండ్రి అయిన గంగిరెడ్డి ప్రముఖ వైద్యులుగా సుపరిచితులు. పేదల వైద్యుడిగా గుర్తింపు ఉన్న ఆయన 2001-05 మధ్య కాలంలో పులివెందుల ఎంపీపీగా పని చేశారు. 2003లో రైతులకు రబీ విత్తనాల కోసం పులివెందుల నుంచి కడప కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసిన గంగిరెడ్డి.. వివాదరహితుడిగా పేరుంది.

గంగిరెడ్డి మరణవార్త విన్నంతనే జగన్ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఆసుపత్రిలో మరణించిన ఆయన్ను కడప జిల్లా వేముల మండలం గొల్లలగూడూరులో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అంత్యక్రియలు జరగనున్నాయి. దీనికి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పాల్గొననున్నారు.

కింది స్టోరీలో జగన్ మామ గురించి తెలుసుకోవచ్చు.

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.