• Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
namasteandhra
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English
No Result
View All Result
namasteandhra
No Result
View All Result

వీసా రెడ్డికి జగన్ షాక్..సజ్జలకు కీలక బాధ్యతలు

admin by admin
April 20, 2022
in Andhra, Politics, Top Stories, Trending
0
0
SHARES
247
VIEWS
Share on FacebookShare on TwitterShare On WhatsApp

గత కొద్ది నెలలుగా వైసీపీలో ఎంపీ విజయసాయిరెడ్డి హవా తగ్గుతోందని టాక్ వస్తోన్న సంగతి తెలిసిందే. విశాఖ జిల్లా ఇన్ చార్జిగా ఉన్న సాయిరెడ్డిపై గతంలో భూ కబ్జా, ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇండస్ట్రీల నుంచి మామూళ్లు వసూళ్లు చేశారన్న ఆరోపణలు రావడంతో జగన్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది. అందుకే, సాయిరెడ్డిని దూరం పెట్టిన జగన్…సజ్జలకు కొద్ది నెలలుగా ప్రాధాన్యతను కల్పిస్తూ వస్తున్నారని తెలుస్తోంది.

ఇటీవల జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలోనూ సాయిరెడ్డి పాత్ర ఏమీలేదని, అంతా సజ్జలే సెట్ చేశారని ప్రచారం జరిగింది. పార్టీలోనూ సాయిరెడ్డిపై కొందరు నేతలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో జగన్ తాజాగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆ ఆరోపణల నేపథ్యంలో సాయిరెడ్డికి జగన్ షాకిచ్చారు. విశాఖ జిల్లా పార్టీ బాధ్యతల నుంచి విజయసాయిని జగన్ తప్పించడం ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. విజయసాయి చేపట్టిన బాధ్యతలను వైవీ సుబ్బారెడ్డికి జగన్ అప్పగించారు.

తాజాగా జిల్లా ఇన్ చార్జిలు, ప్రాంతీయ సమన్వయకర్తలను జగన్ నియమించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుబ్బారెడ్డికి విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాల సమన్వయకర్త బాధ్యతలను జగన్ అప్పగించారు. మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలకు 62 నియోజకవర్గాల బాధ్యతలను అప్పగించారు. అటువంటిది విజయసాయికి ఒక్క జిల్లా బాధ్యతను కూడా అప్పగించలేదు. తాడేపల్లి కేంద్రంగా విజయసాయికి జగన్ వేరే బాధ్యతలను అప్పగించారు.

ఓ పక్క విజయసాయికి పార్టీలో ప్రాధాన్యాన్ని తగ్గిస్తున్న జగన్…అదే సమయంలో సజ్జల రామకృష్ణారెడ్డికి మరింత ప్రాధాన్యతను కల్పించడం విశేషం. పార్టీ సమన్వయకర్తలను, జిల్లా అధ్యక్షులను సమన్వయం చేసే కీలక బాధ్యతను సజ్జలకు జగన్ అప్పగించారు. అంటే, పార్టీలో జగన్ తర్వాత నెంబర్ 2 సజ్జలే అన్నవిషయం మరోసారి రుజువైంది. దీంతో, విజయసాయికి జగన్ షాకిచ్చినట్లయింది.

Tags: ap cm jagandistrict inchargesmp vijaya sai reddysajjala became power housesajjala ramakrishna reddyvijaya sai losing grip in ycp
Previous Post

జగన్ కు షాక్…ఎంపీ గల్లా జయదేవ్ కు ఊరట

Next Post

చంద్రబాబు కోసం ‘100 మంది సూసైడ్ బ్యాచ్’..దేనికంటే….

Related Posts

purandheswari
Andhra

ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!

March 21, 2023
pawan kalyan with nithin
Movies

పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు

March 21, 2023
pawan kalyan
Movies

పవన్-హరీష్.. సర్వం సిద్ధం

March 21, 2023
ys jagan
Andhra

బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?

March 21, 2023
revanth
Politics

తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట

March 21, 2023
kcr speech
Telangana

కేసీఆర్ ధీమా వెనుక

March 21, 2023
Load More
Next Post

చంద్రబాబు కోసం ‘100 మంది సూసైడ్ బ్యాచ్’..దేనికంటే....

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

  • ఈ షాక్‌కు ఖంగుతిన్న పురంధేశ్వ‌రి…!
  • పవన్‌తో చేశాడు.. అభిమానికి పడిపోయాడు
  • పవన్-హరీష్.. సర్వం సిద్ధం
  • బ‌ట‌న్ నొక్కుళ్లు ప‌నిచేయ‌లేదు.. ఇప్పుడు జ‌గ‌న్ చేయాల్సిందేంటి..?
  • తొలిసారి రేవంత్.. బండి నోటి నుంచి ఒకేమాట
  • కేసీఆర్ ధీమా వెనుక
  • వివేకా కేసులో ఒకే రోజు రెండు ట్విస్ట్ లు
  • ఎంపీ మాగుంటకు ఈడీ 24 గంటల డెడ్ లైన్
  • అది కౌరవ సభ…ఇదో చీకటి రోజు: చంద్రబాబు
  • ద‌స్త‌గిరి బెయిల్ ర‌ద్దు చేయండి: వివేకా కేసులో యూట‌ర్న్‌
  • రేవంత్ దెబ్బకు ప్రగతిభవన్ ఉక్కిరిబిక్కిరి
  • ఒత్తిడికి తలొంచక తప్పలేదా?
  • బీఆర్ఎస్ లో ఈ హడావుడి ఎందుకో తెలుసా ?
  • జగన్ పతనానికి ఈ ఫలితాలే నాంది: లోకేష్
  • ఓటమిపై బాలినేని సంచలన వ్యాఖ్యలు

Most Read

తెల్లవారుజామునే రామోజీరావు కి షాక్

శ్రీకాంత్ కొడుకు… ఒకేసారి రెండు

ఆస్కార్ గెలిచిన ‘ది ఎలిఫెంట్ విప్సరర్స్’ సంగతేంటి?

బెల్లంకొండ ఏంటి ఇంత పెద్ద షాకిచ్చాడు !

సీదిరి అప్పలరాజు మాకొద్దు… బ్యాలెట్ బాక్సులో లేఖలు !!

జ‌న‌సేన‌ : ఇద్ద‌రు కీల‌క నేత‌ల‌కు ప‌వ‌న్ ఆహ్వానం

namasteandhra

© 2022 Namasteandhra

Read

  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

Follow Us

No Result
View All Result
  • Home
  • Politics
  • Andhra
  • Telangana
  • NRI
  • Movies
  • Around The World
  • Gallery
  • Astrology
  • E-Paper
  • English

© 2022 Namasteandhra