దేవాల‌యాల‌పై దాడులు.. త‌ప్పించుకోలేని స‌ర్కారు త‌ప్పిదాలు!

ఒక‌టి కాదు.. రెండు కాదు.. అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే హిందూ ఆల‌యాలు, దేవ‌తా విగ్ర‌హాల‌కు సంబం ధించి 102 ఘ‌ట‌న‌లు జ‌రిన‌ట్టు తెలుస్తోంది. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌భుత్వం వైపు నుంచి స‌రైన స్పంద‌న లేద ‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. త‌ప్పు జ‌ర‌గ‌డం, లేదా త‌ప్పిదం జ‌రగ‌డం కామ‌నే. అయి తే.. దానిని అక్క‌డితో నిలుపుద‌ల చేసేలా, మ‌రెక్క‌డా ఎప్పుడూ అలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చూడాల్సిన బాధ్య‌త ప్ర‌భుత్వంపై ఖ‌చ్చితంగా ఉంటుంది.  రాష్ట్రంలో మెజారిటీ హిందు స‌మాజానికి సంబంధించిన ఆయా ఘ‌ట‌న‌ల‌పై మంత్రులే చాలా చ‌వ‌క‌బారుగా వ్యాఖ్య‌లు చేయ‌డం.. ప్ర‌జ‌ల మ‌నోభా వాల‌ను మ‌రింత‌గా కుంగదీశాయి.

ప‌విత్ర‌మైన, నిత్య పూజ‌లు అందుకునే దేవుడి విగ్ర‌హాల‌ను.. బొమ్మ‌లతో పోల్చిన అమాత్యుల కామెంట్ల‌పై సోష‌ల్ మీడియాలో భారీ ఎత్తున విమ‌ర్శ‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఇక‌, సాక్షాత్తూ.. దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస్‌.. కూడా ఆయా ఘ‌ట‌న‌ల‌ను తేలిక‌గా తీసుకున్న‌ట్టే క‌నిపించింది. ఆయ‌న చేసిన కామెంట్లు, ఆయా ఘ‌ట‌న‌ల‌పై స్పందించిన తీరు కూడా తీవ్ర వివాదాల‌కు విమ‌ర్శ‌ల‌కు అవ‌కాశం ఇచ్చిన‌ట్టు అయింది. ఇక‌, హొం శాఖ ప‌రంగా కూడా ఆయా ఘ‌ట‌న‌ల‌ను ఎక్క‌డిక‌క్క‌డ నిలువ‌రించాల్సిన అవ‌స‌రం ఉన్నా.. ఆ దిశ‌గా అడుగులు వేసిన ప‌రిస్థితి మాత్రం క‌నిపించ‌లేదు.

ఎంత‌సేపూ.. రాజ‌కీయంగా స‌ద‌రు విష‌యాల‌ను చూడ‌డం, వాటి నుంచి సింప‌తీని పోగేసుకునేందుకు ప్ర య‌త్నం చేయ‌డంతోనే.. విష‌యాలు మ‌రింత‌గా ముదురుతున్నాయి. దేవాల‌యాల‌పై దాడులు ఆదిలోనే ఖండించి.. స‌రైన దిశ‌గా అడుగులు వేసి ఉంటే.. ప‌రిస్థితి మ‌రో విధంగా ఉండేది. కానీ, మితిమీరిన రాజ‌కీ య ప్రాప‌కం.. సింప‌తీ కోసం వేసిన అడుగులు.. విష‌యాన్ని మ‌రింత క‌ర‌డు క‌ట్టించాయి. ఘ‌ట‌న‌లు జర‌గ‌డం ఒక ఎత్త‌యితే.. వాటిని విచారించి స‌రైన దిశ‌గా ప‌రిష్కారం చూపించ‌డంలో ప్ర‌భుత్వం సంపూర్ణంగా విఫ‌ల‌మైందనేది వాస్త‌వం.

ఆల‌యాల‌పై దాడులు స‌హా ఇత‌ర  విష‌యాల‌కు ఎన్ని రాజ‌కీయ మాస్కులు తొడిగినా.. ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తూనే ఉన్నారు. గ‌త 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలో జ‌గ‌న్ ఓ మాట అన్నారు. `ప్ర‌జ‌ల‌కు అన్నీ తెలుసు. మౌనంగా భ‌రిస్తున్నారంటే.. ఏదో ఒక‌నాడు పేలిపోవ‌డం ఖాయం`` అని. ఇప్పుడు ఇదే మాట జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి కూడా అన్వ‌యం అవుతుంద‌నే విష‌యాన్ని ఆయ‌న మ‌రిచిపోవ‌డ‌మే చిత్రంగా ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు

Tags

Great! You've successfully subscribed.
Great! Next, complete checkout for full access.
Welcome back! You've successfully signed in.
Success! Your account is fully activated, you now have access to all content.