ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డీఎస్సీపైనే పెడతానని టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల వెంకన్నను దర్శించుకునేందుకు చంద్రబాబు కుటుంబసమేతంగా వెళ్లారు. ఇంకేముంది, కొంపలు మునిగిపోయినట్లు వైసీపీ సోషల్ మీడియా విభాగం, వైసీపీ నేతలు మెగా డీఎస్సీపై తొలి సంతకం వ్యవహారంలో రచ్చ రచ్చ చేశారు.
ఈ క్రమంలోనే ఈ రోజు తిరుపతి నుంచి ఉండవల్లికి చేరుకున్న చంద్రబాబు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం మొదటి బ్లాక్ లో ఉన్న తన చాంబర్ లో ఈ రోజు సాయంత్రం 4.41 గంటలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ వెంటనే ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి హోదాలో తొలి సంతకం మెగా డీఎస్సీ ఫైలు పైనే చంద్రబాబు పెట్టారు. 16437 టీచర్ పోస్టుల భర్తీకి చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఏపీలో ఉద్యోగాల వెల్లువను మొదలుబెడుతూ..ఐదేళ్ల నిరుద్యోగల నిరీక్షణకు తెర వేశారు చంద్రబాబు.
మెగా డీఎస్పీలో భాగంగా 16,347 టీచర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. ఇందులో ఎస్జీటీ పోస్టులు 6,371… స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 7,725… టీజీటీ పోస్టులు 1,781… పీజీటీ పోస్టులు 286, పీఈటీ పోస్టులు 132, ప్రిన్సిపల్స్ పోస్టులు 52 ఉన్నాయి.
ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై రెండో సంతకం చేశారు. ఇక, అవ్వాతాతలకు సామాజిక పెన్షన్ ను రూ.4 వేలకు పెంచుతూ మూడో సంతకం ఆ ఫైలుపై చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైలుపై నాలుగో సంతకం, స్కిల్ సెన్సస్ పై 5వ సంతకం చేశారు. సీఎం చాంబర్ లో చంద్రబాబుకు టీడీపీ మంత్రులు అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, కొల్లు రవీంద్ర, ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు అధికారులు, విద్యార్థినులు శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబుకు వారంతా శుభాకాంక్షలు తెలిపారు.
https://x.com/i/status/1801229759780962348
https://x.com/i/status/1801219286117265706