ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికలకు ముందు ప్రకటించిన `పీ-4` మంత్రాన్ని అమలు చేసేందుకు ముహూ ర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఈ ఏడాది ఉగాది నుంచి పీ-4ను అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. దీని కి సంబంధించి ప్రభుత్వం తాజాగా షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఉగాది రోజు.. సీఎం చంద్రబాబు స్వయంగా పీ-4 స్కీంకు సంబంధించిన పోర్టల్‌ను ఆవిష్కరించడంతో దీనికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక, అప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 15 రోజుల పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు తీసుకుంటారు.
అదేవిధంగా ప్రజలకు పీ-4 ప్రాధాన్యాన్ని కూడా.. వివరించనున్నారు. దీనివల్ల ప్రజలకు కలిగే మేలు.. ప్రభుత్వం చేసే పనుల్లో పారదర్శకత వంటి వాటిని కూడా వెల్లడించనున్నారు. తద్వారా.. రాష్ట్రం మరిం త వేగంగా అభివృద్ధి చెందుతుందన్నది.. కూటమి సర్కారు చెబుతున్న మాట. అయితే.. పీ-4పై ఇప్పటికే ప్రజలకు కొంత మేరకు అవగాహన ఏర్పడింది. ఆది నుంచి చంద్రబాబు చెబుతున్న వ్యాఖ్యలను కూడా ప్రజలు నిశితంగా ఆలోచన చేస్తున్నారు. దీంతో పట్టణ, నగర ప్రజలకు పీ-4 భారమనే అభిప్రాయం ఏర్పడింది.
పీ-4 అంటే.. పబ్లిక్-పీపుల్స్-ప్రైవేట్- పార్లనర్షిప్. ఏ ప్రాజెక్టు, లేదా ఏ పనిచేపట్టినా.. దానిలో ప్రజలను , ప్రైవేటు భాగస్వామ్యాన్ని కలుపుకొని ప్రభుత్వం ముందుకు సాగుతుంది. తద్వారా చేపట్టే పనుల్లో ప్రజల ను కలుపుకొని పోతుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పీ-4 విధానంలో రహదారులు నిర్మాణం చేయాలని నిర్నయించిన విషయం తెలిసిందే. ఈ విధానంలో చేపట్టే పనులకు ప్రజల నుంచి రుసుములు వసూలు చేయనున్నారు. దీనిపైనే ఎక్కువగా ప్రచారం జరగడంతో తమపై భారం పడుతుందన్న భావన ప్రబలింది.
అయితే.. ఇప్పుడు సర్కారు మాత్రం పీ-4 విధానంతో మేలు జరుగుతుందని చెబుతోంది. ఈ విధానంలో ఉన్నత స్థాయి వర్గాలను పేదలతో మమేకం చేయడం ద్వారా.. సంపన్న వర్గాల నుంచి వారికి సాయం అందించే క్రతువుకు శ్రీకారం చుట్టినట్టు చెబుతోంది. కానీ, ముందుగా వ్యతిరేకత ప్రచారం కావడంతో ఇప్పుడు సానుకూలంగా చెబుతున్న ఈ వాదన ఏమేరకు ప్రజల్లోకి వెళ్తుందన్నది ప్రశ్నగా మారింది. దీనిపై ప్రజలకు మరింత ఎక్కువగా అవగాహన కల్పించాల్సి ఉంది. ఇది కనుక సక్సెస్ అయితే.. పీ-4 విధానం ద్వారా.. పేదలు ఆర్థికంగా, సామాజికంగా కూడా పుంజుకునే అవకాశం ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది.