కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు విష ప్రచారం చేస్తున్నారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఏడాది ఎన్నికలకు ముందు తాము ఇచ్చిన హామీలకు కట్టుబడిఉన్నామని.. కానీ.. ప్రజల్లో విధ్వేషం పుట్టించేలా కుట్రలు కుతంత్రాలకు దిగుతున్నాయని ఆయన దుయ్య బట్టారు. ఎవరి కోసం నిరసన చేస్తారు? అని పరోక్షంగా జూన్ 4న జగన్ పిలుపునిచ్చిన వెన్నుపోటు దినం నిరసనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
సూపర్ సిక్స్‌కు కట్టుబడి ఉన్నామని.. కానీ.. వైసీపీ చేసిన వ్యవస్థల నాశనం, ఆర్థిక విధ్వంసం కారణంగానే ఇప్పటి వరకు వ్యవస్థలను చక్కదిద్దేందుకు సమయం పట్టిందన్నారు. ఇంకా వ్యవస్థలను చక్కదిద్దేందు కు ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేక పోతున్నామన్నారు. ఒక్క చాన్స్ ఇస్తేనే రాష్ట్రాన్ని దోచు కున్నారని చెప్పారు. ఏపీపీఎస్సీ కుంభకోణం ద్వారా తమ వారికి ఉద్యోగాలు ఇచ్చుకునే ప్రయత్నం చేశారన్న చంద్రబాబు.. దీనికి సంబంధించిన ఆధారాలను కూడా లేకుండా చేశారని చెప్పారు.
ఎంత ఇబ్బంది వచ్చినా.. సామాజిక భద్రతా పింఛన్లను 1వ తేదీనే ఇస్తున్నామని.. 1వ తేదీ సెలవు అయి తే.. ఒకరోజు ముందుగానే పింఛన్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి ఇంటికీ.. వచ్చి పింఛన్లు అందిస్తు న్నామని… చెప్పారు. జూన్ 12న స్కూళ్లు తెరుస్తారని.. అప్పటికి అర్హులైన అమ్మలకు అందరికీ వారి వారి ఖాతాల్లో ఎంత మంది పిల్లలు ఉన్నా రూ.15 వే లచొప్పున తల్లికి వందనం పథకాన్ని అమలు చేసి తీరుతామని చెప్పారు.
రాష్ట్రంలో వాట్సాప్ గవర్నెన్స్‌ను తీసుకువచ్చామని.. జూన్ 12 నాటికి 500 రకాల సేవలను అందుబాటు లోకి తీసుకువస్తామని చెప్పారు. ఎవరూ కార్యాలయాలకు రానవసరం లేకుండా ఇంట్లో కూర్చుని.. వాట్సాప్ ద్వారాప్రభుత్వ సేవలు పొందే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నవజాత శిశువులకు 11 రకాల వస్తువులతో ఎన్టీఆర్ బేబీకిట్లను తీసుకువచ్చామన్నారు. జూన్ 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అమలవుతుందని చెప్పారు. తాజాగా సీఎం చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లాలో పింఛన్లను పంపిణీ చేశారు.