ప్రత్యర్థి పార్టీల నేతలు, వారి కుటుంబ సభ్యులపై నోటికి వచ్చినట్లు మాట్లాడడం… ప్రభుత్వ అధికారులు, పోలీసులను దుర్భాషలాడడం..వైసీపీ నేతలకు పరిపాటిగా మారినట్లు కనిపిస్తోంది. అలా మాట్లాడిన నేతలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటేఅన్యాయం..అక్రమం, అమాయకులను అరెస్టు చేస్తున్నారని జగన్ సహా ఆ పార్టీ నేతలంతా లబోదిబోమని గుండెలు బాదుకోవడం పరిపాటిగా మారింది. ఈ క్రమంలోనే తాజాగా విధి నిర్వహణలో ఉన్న పోలీసు అధికారులపై మాజీ మంత్రి అంబటి నోరు జారారు.
ఏంటి మీరు ఆపేది బొం*…అంటూ పోలీసులను తీవ్రంగా అవమానించారు. దీంతో, అంబటికి పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు. మర్యాదగా మాట్లాడాలని వేలు చూపించి మరీ హెచ్చరించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
జూన్ 4వ తేదీని వెన్నుపోటు దినంగా జరుపుకోవాలని జగన్ పిలుపునివ్వడం ఒక కామెడీ అయితే…దానిని అమలు చేసేందుకు అంబటి గుంటూరు కలెక్టరేట్ కు వెళ్లడం మరో కామెడీ. కార్యక్రమం ఎటువంటిదైనా సరే…తమకు ఉన్నతాధికారుల నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం పట్టాభిపురం సీఐ వెంకటేశ్వర్లు, ఆయన సిబ్బంది గుంటూరు కలెక్టరేట్ వద్ద అంబటిని అడ్డుకున్నారు. కొద్దిమంది ప్రతినిధుల బృందాన్ని మాత్రమే లోపలికి అనుమతిస్తామని చెప్పారు. అయితే, అందరం వెళతాం…ఆపుతావా..ఆపు చూస్తా…ఎలా ఆపుతావో చూస్తా…అంటూ సీఐ వెంకటేశ్వర్లుతో అంబటి వితండవాదానికి దిగారు.
అయినా సరే సీఐ మాట వినని అంబటి…ఏం చేస్తావు…మేం లోపలికి వెళతాం..ఎలా ఆపుతావో చూస్తాం..అంటూ గొడవకు దిగారు. దీంతో, ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఏంటి మీరు ఆపేది…బొం* అంటూ పోలీసులనుద్దేశించి అంబటి దుర్భాషలాడారు. దీంతో, అంబటిపై సీఐ వెంకటేశ్వర్లు ఫైర్ అయ్యారు. మర్యాదగా మాట్లాడాలని, దుర్భాషలాడొద్దని అంబటికి సీఐ వెంకటేశ్వర్లు వేలు చూపించి మరీ వార్నింగ్ ఇచ్చారు. దీంతో, ఏం మాట్లాడుతున్నావ్…అంటే ఏం మాట్లాడుతున్నావ్ అంటూ ఇద్దరూ బాహాబాహికి దిగుతారా అన్న స్థాయికి వాగ్వాదం చేరింది.
అంబటి పళ్లుకొరకడంతో..ఏంటి పళ్లు కొరుకుతున్నావ్ అంటూ అంబటిపై సీఐ మండిపడ్డారు. ఒకరిపైకి ఒకరు దూసుకువచ్చి కొట్టుకుంటారా అన్న రేంజ్ కు పరిస్థితి చేయి దాటుతున్న క్రమంలో పక్కన ఉన్న ఎస్ఐ, ఇతర పోలీసులు ఇద్దరికీ సర్దిచెప్పారు. పోలీసులపై అంబటి జులుం చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అధికారం పోయినా…అంబటి తీరు మారలేదని ఆయనపై ట్రోలింగ్ జరుగుతోంది. అంబటికి దీటుగా జవాబిచ్చిన సీఐ వెంకటేశ్వర్లును కొందరు నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ముందు అంబటి నోరు జారిన తర్వాతే సీఐ రియాక్ట్ అయ్యారని అంటున్నారు.